ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివాహం జరిగిన చాలా మంది ఆడవారిలో గర్భ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.దీని వల్ల వారు గర్భం దాల్చడం( Pregnancy ) దాదాపు సాధ్యం కావడం లేదు.
ఇలాంటి సమస్యలను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఎదుర్కొంటూ ఉన్నారు.ముఖ్యంగా చెప్పాలంటే వివాహమైన కొంత మంది మాత్రం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే మరి కొంతమంది పిల్లలను కనడం ఇష్టం లేక పిల్లలు కలగకుండా శృంగారం చేయాలనే వారు, ఎక్కువగా కండోమ్స్, పిల్స్, కాపర్-T పద్ధతులను ఉపయోగిస్తున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే పైన చెప్పిన పద్ధతులు కాకుండా గర్భనిరోధానికి( Contraception ) మరో కొత్త పద్ధతిని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంపాక్ట్ అనే సాధనాన్ని మహిళల మోచేతి చర్మం పై అమర్చే విధంగా త్వరలో ప్లాన్ చేస్తూ ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే దీని నుంచి మూడు సంవత్సరాల వరకు గర్భనిరోధక హార్మోన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది.దీని వల్ల మహిళలు గర్భం దాల్చలేరు.
కాగా కొద్ది రోజుల తర్వాత అవసరం లేదు అనుకుంటే దీన్ని సులువుగా తీయవచ్చు.అంతే కాకుండా ఈ నూతన పద్ధతిని మొదట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, కర్ణాటకలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా ఈ పద్ధతి పై శాస్త్రవేత్తలు కొన్ని రకాల పరిశోధనలను చేస్తున్నారు.ఈ పద్ధతి పూర్తి స్థాయిలో మెరుగు పరిచిన తర్వాత అందుబాటు లోకి తెచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం( Central government ) వెల్లడించింది.