పుదీనా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.బిర్యానీ, నాన్ వెజ్ వంటల్లో పుదీనాను విరివిరిగా వాడుతుంటారు.
ఆహారానికి చక్కని రుచి, ఫ్లేవర్ ను అందించడంలో పుదీనాకు సాటి మరొకటి ఉండదు.పుదీనాలో అనేక పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
అలాగే జుట్టు సంరక్షణకు సైతం పుదీనా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వారికి పుదీనా ఒక వరం అని చెప్పుకోవచ్చు.

పుదీనా ఆకుల్లో కెరోటిన్ మరియు యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.అదే సమయంలో జుట్టు రాలడాన్ని నివారిస్తాయి మరి ఇంతకీ పుదీనా ఆకులను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా అంగుళం అల్లం ముక్కను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ పుదీనా( Mint Leaves ) ఆకులు వేసుకోవాలి.

అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు( Ginger ) మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్లో నింపుకోవాలి.
ఆ తరువాత స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పుదీనా టానిక్‌ను స్ప్రే చేసుకోవాలి.ఆపై స్కాల్స్ కాసేపు మసాజ్ చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ పుదీనా టానిక్ ను వాడారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.
జుట్టు రాలడాన్ని అరికట్టడం లో ఈ పుదీనా టానిక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా కూడా కొద్ది రోజుల్లోనే అదుపులోకి వస్తుంది.
అలాగే ఈ పుదీనా టానిక్ ను వాడటం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది.మరియు జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.