Papaya : భోజనం తర్వాత బొప్పాయి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

బొప్పాయి( papaya ) .చూడటానికి ఆకర్షణీయంగా, తినడానికి రుచిగా ఉండే పండ్లలో ఒకటి.

 Do You Know What Happens If You Eat Papaya After A Meal-TeluguStop.com

పిల్లల నుంచి పెద్దల వరకు బొప్పాయి పండును చాలా ఇష్టంగా తింటుంటారు.బొప్పాయి పండులో విటమిర్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

అందువల్ల బొప్పాయి పండును డైట్ లో చేర్చుకుంటే అపారమైన ఆరోగ్యం ప్రయోజనాలు చేకూరుతాయి.సాధారణంగా భోజనం తర్వాత ఫ్రూట్స్ తినకూడదని అంటుంటారు.

కానీ బొప్పాయి తింటే మాత్రం మంచి లాభాలు ఉన్నాయి.

చాలా మందికి భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది.

గ్యాస్, ఎసిడిటీ( Gas, acidity ) వంటి సమస్యలతో ఎంత‌గానో ఇబ్బంది బాధపడుతుంటారు.అలాంటి వారు భోజనం త‌ర్వాత కొన్ని బొప్పాయి పండు ముక్క‌లు తిన‌డం ఎంతో మేలు.

ఈ పండులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో మరియు జీర్ణక్రియను సులభతరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం ( Bloating, indigestion )వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించుకోవచ్చు.

Telugu Eatpapaya, Tips, Latest, Meal, Papaya Fruit, Papaya Benefits, Papaya-Telu

బొప్పాయిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.ఇది సాధారణ ప్రేగు కదలికలను మెరుగుప‌రుస్తుంది.జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.అలాగే బొప్పాయి పండును ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌రెన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు.

బొప్పాయిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి.బొప్పాయి పండులో ఉండే లైకోపీన్, బీటా కెరోటిన్లు మరియు కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు గర్భాశయం, రొమ్ము, కాలేయం, ఊపిరితిత్తులు మరియు ప్యాంక్రియాస్‌తో సహా వివిధ రకాల క్యాన్సర్‌ల నుండి రక్షిస్తాయి.

Telugu Eatpapaya, Tips, Latest, Meal, Papaya Fruit, Papaya Benefits, Papaya-Telu

బొప్పాయిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి.ఇవి కీళ్లనొప్పులు, మధుమేహం మరియు అధిక రక్తపోటు వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడ‌తాయి.ఇక బొప్పాయిలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును పెంచుతాయి.ఫైబ‌ర్ మ‌రియు పొటాషియం గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.గుండె జ‌బ్బ‌ల‌ను అడ్డుకుంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube