త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్లు ఎవరో తెలుసా?

సినిమా రంగంలో కొనసాగుతున్న వారికి పెళ్లి గురించి పెద్దగా పట్టింపు ఉండదు.కెరీర్ అయ్యాక చూద్దాంలే అనుకుంటారు సినీ తారలు.

 Tollywood Heroines Are Getting Married Soon, Nayanatara, Sruthi Hassan, Meharee-TeluguStop.com

కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు వివాహం చేసుకోవాలని ఎక్కువగా అనుకోరు.తాజాగా పలువురు నటీమణులు ప్రేమించిన యువకులతో పెళ్లికి రెడీ అవుతున్నారు.

కరోనా నేపథ్యంలో కాస్త బ్రేక్ ఇచ్చి.పరిస్థితులు చక్కబడ్డాక పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటున్నారు.ఇంతకీ పెళ్లికి ముస్తాబవుతున్న ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

నయనతార

Telugu Marriages-Telugu Stop Exclusive Top Stories

సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన నయనతార.తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును రెచ్చగొట్టింది.ఈ భామ ఇప్పటికే పలువురితో ప్రేమాయణం నడిపింది.

కొందరితో పెళ్లికి కూడా రెడీ అయ్యింది.కానీ ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ లవ్ ట్రాక్ నడుపుతోంది.

గత ఏడాది వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.కానీ కరోనా నేపథ్యంలో వద్దు అనుకున్నారు.

ప్రస్తుతం పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది.వీరిద్దరు సెప్టెంబర్‌లో పెళ్లిపీటలెక్కనున్నారని తెలిసింది.కరోనా సెకండ్‌ వేవ్‌ కాస్త దగ్గాక కుటుంబ సభ్యులు, మిత్రుల ఆద్వర్యంలో పెళ్లికి రెడీ అవుతున్నారు.

శృతి హాసన్‌

Telugu Marriages-Telugu Stop Exclusive Top Stories

ఇటాలియన్‌ థియేటర్‌ ఆర్టిస్టు మైకేల్‌ కోర్సల్‌తో ప్రేమలో పడిన ఈ అమ్మడు.కొద్ది రోజుల క్రితం బ్రేకప్ చెప్పింది.రెండేళ్లుగా ఒంటరిగా కొనసాగుతున్న ఈ సుందరి ఈ మధ్యే కొత్త తోడుని పట్టుకుందట.

ఆర్టిస్టు శంతను హజారికాతో సహజీవనం సాగిస్తోందట.అతను అద్భుతమైన ప్రతిభావంతుడని ఈ మధ్యే కమల్ డాటర్ చెప్పింది.

ప్రియుడి సాంగత్యంలో జీవితంలో కొత్త అందాలన్ని చూస్తున్నట్లు చెప్పింది.ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసి తనను పెళ్లి చేసుకోవాలనుకుంటుందట శృతి హాసన్‌.అదీ ఈ ఏడాదిలోనే మూడు ముళ్లు వేసుకోవాలనుకుంటుందట.

మెహరీన్‌

Telugu Marriages-Telugu Stop Exclusive Top Stories

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.గత మార్చిలో నిరాడంబరంగా తన నిశ్చితార్థ వేడుకను జరుపుతకుంది.పంజాబ్‌ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జైపూర్‌లో వైభవంగా జరిగింది.

మరో రెండు నెలల్లో పెళ్లి జరుపుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంటకు కరోనా సెకండ్‌వేవ్‌ బ్రేక్‌ వేసింది.దాంతో మరికొద్ది నెలల పాటు పెళ్లిని వాయిదా వేశారు.

అవికాగోర్

Telugu Marriages-Telugu Stop Exclusive Top Stories

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు జనాలకు దగ్గరైన అవికాగోర్.పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.తాజాగా ఈమె రియాల్టీ అడ్వంచర్‌ షో ఏంటీవీ రోడీస్‌ పార్టిసిపాంట్‌ మిలింద్‌ చద్వానీతో ప్రేమాయణాన్ని సాగిస్తోంది.వచ్చే ఏడాది ఈ జంట వివాహినికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube