తన స్టాఫ్ కు వ్యాక్సిన్ వేయించిన అల్లు అర్జున్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే కరోనా నుండి కోలుకున్న విషయం తెలిసిందే.రెండు వారాల హోం క్వారెంటైన్ టైం లో ఉండి ఫైనల్ గా కరోనాని జయించారు బన్నీ.

 Allu Arjun Team Members And Family Vaccination Process , Allu Arjun, Allu Arjun-TeluguStop.com

అయితే తన టీం లో 45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశాడని తెలుస్తుంది.అల్లు అర్జున్ కు సెపరేట్ గా ఓ టీం ఉంది.

ఆ టీం కోసం అల్లు అర్జున్ ఎప్పుడూ కేర్ తీసుకుంటూ ఉంటాడు.తన సిబ్బందికి ఎలాంటి అవసరం వచ్చినా అన్ని తానై ముందుంటాడు అల్లు అర్జున్.

ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ ను కూడా వేయించినట్టు తెలుస్తుంది.

తన సిబ్బందిలో 45 ఏళ్లు పై బడిన వారందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా ఏరేంజ్ చేశాడు అల్లు అర్జున్.

టాలీవుడ్ స్టార్ హీరోల టీం లలో అల్లు అర్జున్ టీం కూడా క్రేజీగా ఉంటుంది.బన్నీ వారి కోసం చాలా సర్ ప్రైజులు చేస్తుంటాడు.సిబ్బందిలో ఎవరి బర్త్ డే అయినా కూడా అల్లు అర్జున్ దగ్గర ఉండి పార్టీ ఇస్తాడని ఇంతకుముందు వార్తల్లో వచ్చిందే.ఫైనల్ గా తన దగ్గర పనిచేస్తున్న వారిలో ముందు 45 ఏళ్లు ఆ పైన వయసు వారికి వ్యాక్సిన్ వేయించారు అల్లు అర్జున్.

తన స్టాఫ్ మాత్రమే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కు కొవిడ్ వ్యాక్సిన్ వేయించారట అల్లు అర్జున్.ఈ కార్యక్రమాలను దగ్గర ఉండి అల్లు అర్జున్ చూసుకున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube