మెగాస్టార్ చిరంజీవికి మంచితనం ఎక్కువని ఇండస్ట్రీలో అందరూ భావిస్తారు.తన మాటల వల్ల ఎవరూ బాధ పడకూడదని భావిస్తారు.
వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ తెలుగు సినిమా ఎప్పటినుంచో స్వర్ణయుగంలో ఉందని అన్నారు.నేటి తరం హీరోలు, దర్శకులు ఆ స్వర్ణ యుగాన్ని కొనసాగిస్తున్నారని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
నా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అది ఇవ్వడానికి నేను ప్రాధాన్యత ఇస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు.వాల్తేరు వీరయ్యలో పాత చిరంజీవిని మళ్లీ చూస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
వాల్తేరు వీరయ్యలో కనిపించిన స్థాయిలో మరే సినిమాలో మాస్ గా కనిపించలేదని చిరంజీవి పేర్కొన్నారు.నాతో పని చేసేవాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్లు చేశారు.

మంచి సినిమా ఎప్పుడైనా విజయం సాధిస్తుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.అతి మంచితనం కచ్చితంగా అవసరమేనని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.ఏదైనా సంఘటన జరిగిన సమయంలో ఎదురుతిరిగితే నా అహం చల్లారినా సినిమాకు భారీ స్థాయిలో నష్టం కలుగుతుందని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.అలా జరిగితే ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతారని చిరంజీవి చెబుతారు.

నా సంయమనం ఇంతమందికి మంచి చేస్తుందని తెలిస్తే వెనక్కి తగ్గడానికి నాకు ఎలాంటి సమస్య లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు.చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిరంజీవి వెల్లడించిన విషయాలు ప్రసుతం హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.వాల్తేరు వీరయ్య రిజల్ట్ విషయంలో చిరంజీవి పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.చిరంజీవి రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరగనుందని తెలుస్తోంది.సినిమా సినిమాకు చిరంజీవి నటుడిగా స్థాయిని పెంచుకోవాలని భావిస్తున్నారు.
చిరంజీవికి రాబోయే రోజుల్లో సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.