మన దేశంలో క్రికెట్‌ను ఉన్న క్రేజ్ వేరే లెవల్.ఇక రోహిత్ శర్మ హిట్టింగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.
కాగా ఆయన ఇప్పుడు టీ 20 ప్రపంచకప్ కు రెడీ అవుతున్నాడు.ఇందులో భాగంగా ఆయన ఫస్ట్ వార్మప్ మ్యాచుకు దూరంగా ఉన్నాడు.
అంటే బ్యాటింగ్ చేయకుండా బెంచ్‌లోనే కూర్చున్నాడు.ఇలా కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు రోహిత్ శర్మ సైడుకు ఉన్నాడన్న మాట.
కానీ ఇదిలా ఉంటే ఇప్పుడు రోహిత్ మీద ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ అయిన డేవిడ్ వార్నర్ ఓ పెద్ద కామెంట్ చేశారు.
అదేంటంటే రోహిత్ శర్మ తన స్టైల్‌ను కాపీ చేశాడంటూ సోషల్ మీడియాలో రచ్చకు దారి తీశాడు.
వాస్తవానికి రోహిత్ శర్మ నిత్యం సోషల్ మీడియాలో చాలా పాల్గొంటాడు.నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుంటాడు.తనకు సంబంధించిన ఏదో ఒక వీడియోను పంచుకుంటూ నెటిజన్లను ఆకట్టుకుంటాడు.ఇందులో భాగంగానే ఇప్పుడు టీమిండియా జెర్సీతో రోహిత్ శర్మ ఓ వీడియోను చేసి దాన్ని నెట్టింట పంచుకున్నాడు.
తనకు కేటాయించిన హోటల్ గదిలో ఈ విధంగా జెర్సీతో టిక్‌టాక్ చేశాడు.
ఇంకేముంది ఈ వీడియో నెట్టింట బాగా పాపులర్ అయిపోయింది.ఆయన అభిమానులు అందరూ దీనిపై కామెంట్ల వర్షం కురిపిస్తూ ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.అయితే దీనిపై డేవిడ్ వార్నర్ మరో రకంగా స్పందించాడు.
రోహిత్ తన టిక్ టాక్ స్టైల్‌ను కాపీ చేశాడంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు డేవిడ్ భాయ్.ఎందుకంటే డేవిడ్ కూడా నిత్యం టిక్ టాక్ వీడియోలు చేస్తుంటాడు.
తన భార్యతో చేసే వీడియోలు ఎంతలా ఆకట్టుకుంటాయో తెలిసిందే.ఇక రోహిత్ వీడియోపై యుజ్వేంద్ర చాహల్ తొ పాటు కుల్దీప్ యాదవ్ కూడా ఫన్నీ మీమ్స్ పెడుతున్నారు.