టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.ఈమె చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ ఈమె మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయిందనే చెప్పాలి.
ఈమె అందం, అభినయం అన్ని కూడా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి.శ్రీలీల రాఘవేంద్రరావు పర్వేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా వెండి తెరమీద అడుగు పెట్టింది.
ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు.ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది.ఈ సినిమా తర్వాత శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకు పోతుంది.ఈమె ఆఫర్స్ వచ్చే కొద్దీ రేటు కూడా భారీగా పెంచుకుంటూ పోతుంది.
తాజాగా నితిన్ కొత్త సినిమాలో ఈ అమ్మడిని హీరోయిన్ గా తీసుకున్నారు.

నిన్న నితిన్ తన 32వ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు.ఈ సినిమాను రైటర్ వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాను ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నికిత రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమా త్వరలోనే రెగ్యురల్ షూటింగ్ షురూ చేయనుంది.అయితే తాజాగా ఈ సినిమాలో శ్రీలీల అందుకుంటున్న రెమ్యునరేషన్ గురించి వార్త నెట్టింట వైరల్ అయ్యింది.
ఈమె ఈ సినిమాకు ఏకంగా రూ 1.25 కోట్లు డిఎంను చేసిందట.ఈమెకు ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలు కూడా ఈమెకు అడిగినంత ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈమె ఈ సినిమాతో పాటు రవితేజ ధమాకా సినిమాలో కూడా నటిస్తుంది.అలాగే గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి డబ్యూ సినిమాలోనూ ఈమె హీరోయిన్ గా ఫిక్స్ చేసారు.
ఇలా ఈమెకు చేతినిండా ఆఫర్స్ తో ఈ అమ్మడు బిజీగా ఉంది.







