విజయ దేవరకొండ విడుదల చేసిన పంచతంత్రం చిత్రంలోని అరెరే..అరెరే.. మాటే..రాదే... మనసే పలికే క్షణములో..లిరికల్ వీడియో

టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ పతాకంపై కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య నటీనటులుగా హర్ష పులిపాక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘’పంచతంత్రం”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్భంగా ఈ చిత్రంలోని “అరెరే అరెరే మాటే.రాదే.మనసే పలికే క్షణములో”… లిరికల్ వీడియోను సెన్సేషల్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు.

 'panchathantram': Sensational Hero Vijay Deverakonda Unveils 'arere Arere' Song-TeluguStop.com

అరెరే అరెరే మాటే.రాదే.

మనసే పలికే క్షణములో… పిలిచి అడిగి ఆరా తీ.సి చనువే వెతికే వయసులో.ఎదురు బదురు చేరే వేళ నదురు బెదురు మామూ.లేనా.తానే ఇపుడు గీత దాటేలా మో.మాటలేనా… ఓహోహో హో.

లిరికల్ వీడియోను కిట్టు విస్సాప్రగడ రాయగా ప్రశాంత్‌ ఆర్‌.విహారి, శ్రవణ్ భరద్వాజ్ లు సంగీతం అందించారు.

ఈ పాటని చిన్మయి,ఎస్.పి చరణ్ లు అద్బుతంగా ఆలపించారు.

రాజ్ కె నల్లి కెమెరా విజువల్స్ ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ… ఇంతకు ముందు వచ్చిన పెళ్లి పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ మధ్య కాలంలో ఇటువంటి పాటలు ఫీలింగ్ తగ్గిందని చెప్పుకోవాలి…”అరెరే అరెరే మాటే.రాదే.మనసే పలికే క్షణములో”.పాట చూసిన తరువాత మళ్లీ గత జ్ఞాపకాలను ప్రేక్షకులను కంపల్సరీ గా మంత్ర ముగ్దులను చేస్తాయి.

అలాగే వారి జీవితంలో జరిగిన పెళ్లి తంతుల్ని రీకలెక్ట్ చెసే పాటగా ఈ పాట నిలిచిపోతుంది.మేము ఇంతకు ముందు బ్రహ్మానందంపై విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫ‌స్ట్ గ్లింప్స్‌, ఏ రాగమో లిరికర్ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు విజయదేవరకొండ చేతుల మీదుగా విడుదల చేసిన “అరెరే.అరెరే.మాటే.రాదే.మనసే పలికే క్షణములో.లిరికల్ వీడియో సాంగ్ కూడా అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకం ఉంది.బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వించారు.అలాగే ఆయనలో అద్భుతమైన నటుడు ఉన్నారు.వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు మా సినిమాలో వేదవ్యాస్ గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

నటీనటులు:

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

సాంకేతిక వర్గం:

పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా),కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియమ్‌, ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె.నల్లి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి, శ్రవణ్ భరద్వాజ్, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు, రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube