అమెరికాలోని భారతీయులకు శుభవార్త.. న్యూయార్క్‌లో ఆ వీధికి ‘‘వినాయకుడి’’ పేరు..!!!

ప్రపంచంలో ఏ మూలన ఉన్నా .ఎవరినైనా సరే భారతీయ సాంప్రదాయాలు ఆకర్షిస్తూనే వుంటాయి.

 Us: Street In New York Named Ganesh Temple Street After Prominent Hindu Temple ,-TeluguStop.com

అందుకే పాశ్చాత్యులు సైతం భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ముగ్ధులై పోతుంటారు.ఎంతోమంది విదేశీయులు మనదేశానికి వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారంటే అది మన సనాతన ధర్మం గొప్పదనం.

భారతీయులను ఎన్నో దేశాల ప్రజలు ప్రేమిస్తారు, గౌరవిస్తారు.ఎక్కడకు వెళ్లినా భారతీయులు మూలాలను మరిచిపోరు.

అదే మనదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతోంది.

ఈ క్రమంలో అమెరికాలోని భారతీయులకు శుభవార్త.న్యూయార్క్‌లోని ఓ వీధికి వినాయకుడి పేరు మీద ‘‘గణేశ్ టెంపుల్ స్ట్రీట్’’గా పేరు పెట్టారు.1977లో ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా నెలకొల్పిన శ్రీ మహ వల్లభ గణపతి దేవస్థానాన్ని.గణేష్ టెంపుల్ అని కూడా పిలుస్తారు.ఇది ఉత్తర అమెరికాలో తొలి, పురాతన హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది.ఇది క్వీన్స్ కౌంటీలోని ఫ్లషింగ్‌లో వుంది.తొలుత ఈ ఆలయం వెలుపల వున్న వీధికి బౌన్ స్ట్రీట్ అని పేరు పెట్టారు.

మతపరమైన స్వేచ్ఛ, బానిసత్వ వ్యతిరేక ఉద్యమానికి మార్గదర్శకుడైన జాన్ బౌన్ జ్ఞాపకార్థం ఆయన పేరును ఈ వీధికి పెట్టారు.అయితే శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఐకానిక్ వినాయకుడి ఆలయ గౌరవార్థం.

ఈ వీధికి ‘గణేశ్ టెంపుల్ స్ట్రీట్’ అని పేరు పెట్టారు.ఈ కార్యక్రమానికి న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ రణధీర్ జైస్వాల్, క్వీన్స్‌బోరో ప్రెసిడెంట్ డోనోవన్ రిచర్డ్స్, దిలీప్ చౌహాన్, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.

Telugu Dilip Chauhan, Ganeshtemple, Hindu Temple, John Boun, York, Randhir Jaisw

కాగా.భారత్‌లోని ప్రముఖ పండుగలలో ఒకటైన ఉగాదికి టెక్సాస్ రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ 2వ తేదీని “తెలుగు భాషా వారసత్వ దినంగా” ప్రకటించారు ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్.విద్య, వైద్య, వాణిజ్య, ప్రభుత్వ, కళా రంగాలలో తెలుగువారు పోషిస్తున్నపాత్ర మరువలేనిదని .ఇక్కడ స్థిరపడిన లక్షలాది మంది తెలుగు వారు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని గవర్నర్ ఓ ప్రకటనలో ప్రశంసించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube