భారతదేశంలో అతి చౌకగా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలిగే ప్రయాణ సాధనం ఏదైనా ఉందంటే అది రైలు మాత్రమే.అతి తక్కువ ఖర్చుతో భారతదేశం మొత్తాన్ని ప్రయాణం చేయవచ్చు.
ఇకపోతే రైలులో ప్రయాణం చేయాలనుకునేవారు ఐఆర్సిటిసి ద్వారా టికెట్లు బుక్ చేసి ప్రయాణం చేస్తారు.ఇకపోతే తాజాగా ఐఆర్సిటిసి తో కలిసి భారత దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బిఐ బ్యాంక్ ఓ రూపే కార్డు ను తీసుకు వచ్చింది.
ఐఆర్సిటిసితో ఎస్బిఐ రూపే కార్డు పేరుతో తీసుకువచ్చిన ఈ కార్డును ఉపయోగించి వినియోగదారులు నిబంధనల మేరకు కొన్ని ఉచితంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
భారతదేశంలో ఆత్మ నిర్మల్ భారత్ లో భాగంగా మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారతదేశ ప్రభుత్వం కృషి చేస్తున్న సంగతి అందరికీ విదితమే.
ఇందులో భాగంగానే తాజాగా ఎస్బిఐ, ఐఆర్సిటిసి, ఎన్ పిసిఐ లు కలిసి సంయుక్తంగా ఈ కొత్త కార్డును తీసుకువచ్చాయి.దీనితో చెల్లింపులు మరింత వేగంగా, భద్రంగా చేసుకోవచ్చు.
కరోనా వైరస్ లాక్ డౌన్ నిబంధనలు తర్వాత ఇప్పుడిప్పుడే రైలు ప్రయాణాలు కాస్త ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ కార్డ్ విడుదల చేయడం ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇకపోతే ఈ కార్డును పొందడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఓసారి చూద్దాం.
ముందుగా మార్చి 31 2021 వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ కార్డును ఉచితంగా పొందవచ్చు.ఈ కార్డు ద్వారా ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా రైల్ టికెట్ బుక్ చేసుకునే వారికి పది శాతం వరకు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి.
ఇలా వచ్చిన రివార్డ్స్ వల్ల వినియోగదారులు ఉచితంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.ఈ కార్డు పొందిన మొదటి నాలుగైదు రోజుల్లో 500 రూపాయలు అంతకన్నా ఎక్కువ లావాదేవీలు జరిగితే వినియోగదారులు 350 బోనస్ పాయింట్లు కూడా పొందవచ్చు.
ఈ కార్డు తో ఐఆర్సిటిసి ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు చెల్లించాల్సిన డబ్బులలో ఒక శాతం మేర తగ్గుతుంది.ఇందుకుగాను మూడు నెలలకు ఒకసారి ఉచితంగా ప్రీమియం లాంచ్ సదుపాయాన్ని మనం పొందవచ్చు.
వీటితోపాటు బయట పెట్రోల్ పంప్స్ లో కూడా ఒక శాతం చార్జి మనకు మినహాయింపు లభిస్తుంది.ఈ కార్డులో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ఫీచర్ ద్వారా ఆన్లైన్లో దేవీలు అలాగే కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు.
ఇందుకు సంబంధించి త్వరలోనే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.ఇవే కాదు ఈ కార్డును ఉపయోగించి మెడ్ లైఫ్, ఫిట్టర్ నీటి, మీ ఎన్ మామ్స్ మొదలైనవాటి యాప్స్ నుండి కొనుగోలు చేస్తే కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు.ఇందుకు సంబంధించి నిబంధనలు షరతులు పూర్తి వివరాల కోసం www.sbicard.com సైట్ లో తెలుసుకోవచ్చు.