తారక్ కొరటాల భారీ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనా.. ఇదే సాక్ష్యం అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయినట్టేనని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కొరటాల శివ చెప్పిన కథ తారక్ కు నచ్చలేదని కొరటాల శివకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా తన కథతో ఇంప్రెస్ చేసే విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 Tarak Koratala Shiva  Combination Movie Shelved Details Here Goes Viral Tarak,-TeluguStop.com

ఆచార్య రిజల్ట్ కొరటాల శివను తీవ్రస్థాయిలో బాధ పెట్టిందని ఆ బాధ నుంచి బయటకు రావాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఆయన బయటకు రాలేకపోతున్నారని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్30 విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ విషయంలో అప్సెట్ అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదని అదే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పడానికి సాక్ష్యమని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

తారక్ కొరటాల శివకు మరి కొంత సమయం ఇచ్చారని అప్పటిలోపు కొరటాల శివ ఇంప్రెస్ చేయకపోతే మాత్రం తారక్ మరో ప్రాజెక్ట్ తో ముందుకు వెళతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమా ఆగిపోయినట్టు వస్తున్న వార్తల గురించి అయినా ఎన్టీఆర్30 టీమ్ స్పందిస్తుందేమో చూడాలి.

ఎన్టీఆర్30 ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే తారక్ హీరోగా తెరకెక్కే ఛాన్స్ ఉంది.ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి కథ విషయంలో కూడా తారక్ కు ఎలాంటి సమస్య లేదు.తారక్ స్పందించి ఈ ప్రాజెక్ట్ గురించి మరింత క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ఆర్.ఆర్.ఆర్ తర్వాత సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించాలని తారక్ కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube