నెల్లూరులో రాజకీయా రోజుకో మలుపు తిరుగుతూ ఉంది.అధికార వైసీపీలో రోజు రోజుకు ముసలం పెరిగిపోతూ ఉంది.
అసమ్మతి గళం వినిపించిన ప్రతి ఎమ్మెల్యే పైన అధిష్టానం ఫోకస్ చేసింది.అంతే కాదు ఏకంగా వాళ్ళ ఫోన్లని టాప్ చేస్తున్నారు అని అసమ్మతి నేతలు చెబుతున్నారు.
నెల్లూరు లో అటు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డీ శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి లు నిరసన గళం మొదలు పెట్టారు.మంత్రి పదవి దక్కలేదు అనే.ఈ నేతలు అసమ్మతి గళం వినిపించారు అని తెలుస్తోంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటా రెడ్డీ శ్రీధర్ రెడ్డి అధిష్టానం పై కోపం తో సైలెంట్ గ తన పని తాను మొదలు పెట్టారు.
వైసీపీలో ఉంటూనే టీడీపీ లో టికెట్ కు కచిఫ్ వేశారు.వైసీపీ లో టికెట్ రాదు అని ఫిక్స్ అయ్యాక.టీడీపీ నుంచి పోటీ చేయాలని ప్రిపరేషన్ మొదలు పెట్టారు.అది ఆ నోటా ఈ నోటా అధిష్టానం దృష్టికి వెళ్లింది.
అప్పటి నుంచి తన పై పార్టీ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

అయితే కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీదర్ రెడ్డీ ఇప్పుడు నిరసన గేలం మొదలు పెట్టారు.కాల్ రికార్డింగ్ లో ఉన్నట్టే.విమర్శలు షురూ జేశారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాటలకు గట్టి కౌంటర్ ఇస్తు ప్రకటనలు చేస్తున్నారు.తాను బయటకు వచ్చి త్వరలోనే ఆధారాలు బయట పెడతానని.
ఇద్దరు పెద్ద అధికారుల ఉద్యోగాలు పోవడం ఖాయం అని సవాల్ విసిరారు.అక్కడితో ఆగకుండా పార్టీ సమన్వయ కర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డి పై విమర్శలు కురిపించారు.
ఇంకో వైపు జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాటలకు కూడా శ్రీధర్ రెడ్డీ కౌంటర్ ఇచ్చారు.

ఇవన్నీ చూస్తుంటే.ఆడియో లో ఉన్నట్టు శ్రీధర్ రెడ్డి పక్క చూపులు చూసింది నిజమే అన్నట్టు కనిపిస్తోంది.175 టార్గెట్ గా పెట్టుకున్న పార్టీ అసమ్మతి నేతలపై గట్టిగానే ఫోకస్ పెట్టింది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మరి ఒక్క నెల్లూరు తోనే ఈ అసమ్మతి ముగుస్తోందా.? లేక పక్క జిల్లాల నేతలకు ఇది పాకుతుందా చూడాలి.
