టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ పైనే దృష్టి పెట్టాయి.గ్లోబల్ అడ్వెంచర్ గా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసం రాజమౌళి సీసీఏతో డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది.ప్రపంచవ్యాప్తంగా దర్శకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న జక్కన్న తాను క్రిటిక్స్ ప్రశంసల కోసమే సినిమాలు తీస్తాను తప్ప డబ్బు కోసం కాదని తెలిపారు.
ఆర్ఆర్ఆర్ సినిమాను కమర్షియల్ సినిమాగానే తెరకెక్కించానని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు.నా సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తే సంతోషం కలుగుతుందని జక్కన్న తెలిపారు.నా సినిమాకు అవార్డులు కూడా వస్తే ఆ సంతోషం రెట్టింపు అవుతుందని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావాలని చిత్ర యూనిట్ కోరుకుంటుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
ఈ సినిమా విడుదలై పది నెలలు అవుతున్నా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ జరుగుతూనే ఉంది.ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ ను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజమౌళి బాక్సాఫీస్ వద్ద మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రాజమౌళి మహేష్ సినిమాతో మరోసాతి బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని తెలుస్తోంది.మూడేళ్ల పాటు ఈ సినిమా షూట్ జరగనుందని తెలుస్తోంది.జక్కన్న వేగంగా సినిమాలను తెరకెక్కించాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
జకన్న పారితోషికం 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ పెరిగిందని తెలుస్తోంది.రాజమౌళి ఇతర భాషల హీరోలతో కూడా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రాజమౌళి ఇతర స్టార్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తుండటం గమనార్హం.