మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అలాగే నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంది.ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో ప్రాంతీయ సినిమా అనే కాన్సెప్ట్ ఉండదని, ఏ సినిమా తీసిన అది ఇండియన్ సినిమా అవుతుందని,అందుకు ఉదాహరణగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రం అని చెప్పవచ్చు అంటూ మెగాస్టార్ వెల్లడించారు.
ఈ విధమైనటువంటి రూపకర్త మన చిత్ర పరిశ్రమలో ఉండడం గర్వకారణం.భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి అంటూ రాజమౌళి గురించి మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు.

రాజమౌళి గురించి మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఆచార్య సినిమా విషయానికి వస్తే.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు, పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.
ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.







