పొద్దు తిరుగుడు పంటలో మాడు తెగులను అరికట్టే సస్యరక్షక పద్ధతులు..!

Plant Protection Methods To Prevent Moths In Paddu Tirugudu Crop , Paddu Tirugudu Crop, Regadi, Ondru, Plant Protection Methods

పొద్దు తిరుగుడు నూనె( Sunflower oil ) కు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది.దేశంలో పొద్దుతిరుగుడును అధిక విస్తీర్ణంలో పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది.

 Plant Protection Methods To Prevent Moths In Paddu Tirugudu Crop , Paddu Tirugud-TeluguStop.com

ఉత్పాదకతలో ఐదవ స్థానంలో ఉంది.ఈ పంట సాగు చేయడానికి నీరు నిల్వ ఉండని అన్ని నేలలు అనుకూలంగా ఉంటాయి.

కాకపోతే రేగడి, ఒండ్రు ( Regadi, Ondru )నేలలలో అధిక దిగిబడి పొందవచ్చు.భూమి యొక్క పీహెచ్ విలువ 6 నుండి 8 వరకు ఉండే నేలలు అనుకూలం అని చెప్పవచ్చు.

క్షార విలువలు అధికంగా ఉంటే అధిక దిగుబడి వస్తుంది.లోతట్టు ప్రాంతంలో ఉండే నేలలు, తేమ అధికంగా నిల్వ ఉండే నేలలు, సముద్రతీరా ప్రాంతానికి దగ్గరిగా ఉండే నేలలు ఈ పొద్దు తిరుగుడు సాగుకు అనుకూలంగా ఉండవు.

Telugu Agriculture, Latest Telugu, Ondru, Paddutirugudu, Methods, Regadi-Latest

ఇక ఈ పంట సాగు చేయడానికి ముందు భూమిని వేసవిలో లోతు దుక్కులు దున్ని మెత్తగా తయారు చేసుకోవాలి.ఇక నీటి వసతులు ఉంటే ఏడాదిలో ఏ కాలంలో అయినా ఈ పంటను పండించవచ్చు.కాకపోతే ఈ పంట పూత దశ, గింజలు తయారయ్యే దశలో అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత 38 కంటే ఎక్కువగా ఉంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంది.కాబట్టి ఈ విషయాలను గుర్తు పెట్టుకొని పంటను సాగు చేయాలి.

Telugu Agriculture, Latest Telugu, Ondru, Paddutirugudu, Methods, Regadi-Latest

ఇక ఈ పంటకు తీవ్ర నష్టం కలిగించే మాడు తెగులు ఎక్కువగా వర్షాకాలం, చలికాలంలో పంటను ఆశిస్తాయి.పంట వేసిన 50 రోజుల తర్వాత ఈ తెగులు పంటను ఆశించే అవకాశం ఉంది.పొద్దు తిరుగుడు ఆకులపై గోధుమ రంగులో లేదా నలుపు రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడతాయి.ఈ మచ్చలు మొక్క మొత్తం వ్యాపించి గింజ యొక్క నాణ్యత తగ్గిపోయేలా చేస్తాయి.

ఈ తెగుల నివారణకు లీటరు నీటిలో కాపర్ ఆక్సి క్లోరైడ్ మూడు గ్రాములు కలిపి పిచికారి చేయాలి.లేదంటే రెండు గ్రాముల మెటాలాక్సిన్ ఎం.జడ్ ను నీటిలో కలిపి పిచికారి చేసి ఈ తెగుల నుండి పంటను సంరక్షించుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube