న్యూ ఇయర్ వేడుకలకు ఎంజాయ్ చేయడం ప్రతి ఒక్కరికి అలవాటు.ఇలా ఎంజాయ్ చేద్దామనుకుని భావించిన కొంత మందికి మాత్రం చుక్కలు కనబడ్డాయి.
వారు న్యూ ఇయర్ వేడుకల కోసం బుక్ చేసుకున్న షిప్ లో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది.దీంతో వారికి ఏం చేయాలో తోచడం లేదు.
వారు అటూ రాలేక ఇటూ రాలేక సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు.ఎంజాయ్ కోసమని వెళ్తే కరోనా రావడంతో అందరూ షాక్ లో మునిగి పోయారు.
ఇంక ఏం జరిగిందంటే.
న్యూ ఇయర్ వేడుకల కోసమని ముంబై నుంచి కార్డెలియా క్రూయిజ్ షిప్పులో సుమారు రెండు వేల మంది ప్రయాణికులు గోవాకు వెళ్లేందుకు పయనమయ్యారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.కానీ ఆ తర్వాతే పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది.
అదేంటంటే ఆ నౌకలో కొంత మందికి కరోనా సోకిందనే నిజం.వీరంతా చేసిన ఎంజాయ్ మొత్తం మర్చిపోయారు వారికి ఒక్కసారిగా దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.
నౌకలో కరోనా కలకలం రేగిందని బయటకు పొక్కడంతో ఆ నౌకను తమ రాష్ట్రంలోకి అనుమతించేందుకు గోవా సర్కారు అభ్యంతరం తెలిపింది.ఇలా వారు గోవా వారు వద్దనడంతో ఎటు వెళ్లలేక దిక్కుతోచని పరిస్థితిలో అలాగే ఉన్నారు.
ఇండియాలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.గడిచిన వారం రోజులుగా ఇండియాలో కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఎవరూ ఊహించని విధంగా కేసులు వస్తున్నాయి.ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి.
కేసుల సంఖ్య పెరుగుతూ పోతున్నా కూడా కొంత మంది మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు.మాస్కులు ధరించకుండా బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు.
ప్రభుత్వాలు ఎంత చెప్పినా కానీ వినకుండా పెడ చెవిన పెడుతున్నారు.