నంద్యాల జిల్లా డోన్ లో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పట్టణంలోని 30, 31 వ వార్డులలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నాడు.ఈ కార్యక్రమంలో అడుగడుగునా మంత్రికి బుగ్గనకు సమస్యల వెల్లువ ఎదురైంది… ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తుండగా సమస్యల పై మహిళలు నిలదీశారు.
ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం అని మంత్రి చెప్పగా ధరలు పెంచి మా డబ్బులు మాకే తిరిగి ఇస్తున్నారు అని మంత్రి కి ఎదురు ప్రశ్నించటంతో అక్కడ ఉన్న అధికారులు అవాక్కయ్యారు… 31వ వార్డ్ కి చెందిన మహిళ మాధవి మాకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా మాకు టైలర్స్ డబ్బులు రాలేదని వాపోయారు.ఏమి రెడ్డి ఎద్దు ఈనితే దొడ్ల కట్టయిపో అన్నట్లు ఉంది మీ రెడ్డి గారి ప్రభుత్వం అని మంత్రిని మహిళ నిలదీసింది… జగనన్న ప్రభుత్వం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మాఇంట్లో 3 ఓట్లు వైసీపీకే వేశామాని ఆరోపించారు.
నూనె ధర 200 రూపాయలు చేసి మా డబ్బులు మాకు ఇస్తున్నారు మీరేమైన ఉరిక ఇస్తున్నారా అని మంత్రిని ప్రశ్నించారు.అనంతరం డోన్ పట్టణంలో భూ ఆక్రమణలు, మ్యూనిసిపల్ స్థలాలపై కబ్జాలు చేస్తున్న వై.కాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని మంత్రికి సి.పి.ఎం నాయకులు వినతి పత్రం అందజేశారు