చౌకైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూ.87కే డైలీ 1జీబీ డేటా..

దేశీయ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ( BSNL ) ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా తమ ఫోన్‌లను ఉపయోగించాలనుకునే వ్యక్తుల కోసం తాజాగా కొన్ని చౌకైన ప్లాన్‌లను తీసుకొచ్చింది.ఈ ప్లాన్‌లలో ఒకదాని ధర కేవలం రూ.87 కావడం విశేషం.ఈ ప్లాన్ కస్టమర్లకు రోజూ 1GB డేటాను అందిస్తుంది.

 Bsnl Has Brought News Plans.. Daily 1gb Data Only For Rs.87 ..bsnl, Telecom C-TeluguStop.com

ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేయడానికి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి ఈ డేటా సరిపోతుందని చెప్పవచ్చు.ఇక రోజులో 1GB డేటాను ఉపయోగించిన తర్వాత కూడా ఇంటర్నెట్ వాడవచ్చు.

కాకపోతే ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా మారుతుంది.

ఈ ప్లాన్‌తో మీరు ఏ నంబర్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్‌ను కూడా చేసుకోవచ్చు.అంటే గంటల కొద్ది సమయం పాటు మీకు కావలసిన వారితో మాట్లాడవచ్చు.రోజూ 100 ఫ్రీ టెక్స్ట్ మెసేజ్‌లు కూడా పంపవచ్చు.

ఈ ప్లాన్ 14 రోజుల వాలిడిటీతో వస్తుంది.అంటే ఇది రెండు వారాల పాటు పని చేస్తుంది.

మీకు ఎక్కువ కాలం ఉండే ప్లాన్ కావాలంటే, ఇతర చౌకైన ఎంపికలు కూడా ఉన్నాయి.

ఢిల్లీ, ముంబై( Delhi )లోని వ్యక్తుల కోసం పరిచయం చేసిన మరో ప్లాన్ రూ.108.ఇది కస్టమర్లకు 28 రోజుల పాటు రోజూ 1GB డేటాను అందిస్తుంది.అన్‌లిమిటెడ్ కాల్స్‌ ఆఫర్ చేస్తుంది.కానీ MTNL నెట్‌వర్క్ నంబర్‌లకు మాత్రమే అన్‌లిమిటెడ్ కాల్స్‌ చేసుకోవడం కుదురుతుంది.బీఎస్ఎన్ఎల్( BSNL ) దేశంలోని ప్రతి ఒక్కరూ తమ ఫోన్లను ఉపయోగించుకునేలా, బంధుమిత్రులతో కనెక్ట్‌ అయ్యేలా చేయాలనుకుంటోంది.అందులో భాగంగా పేదవారి అవసరాలకు అనుగుణంగా విభిన్న ఎంపికలతో ఈ సరసమైన ప్లాన్‌లను అందించింది.

ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మంచి సేవను కోరుకునే వ్యక్తుల కోసం ఇవి బెస్ట్ ప్లాన్స్‌ అవుతాయని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube