కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అవిశ్వాస రాజకీయం రచ్చకెక్కింది.జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం నేతలు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.
జమ్మికుంటలో రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాలు చేశారు.ఈ క్రమంలోనే అవిశ్వాసం పెట్టాలని ఓ వర్గం కౌన్సిలర్లు డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.
దీనిపై మరో వర్గంలోని కౌన్సిలర్లు అవిశ్వాసం వద్దని వినతిపత్రం అందజేశారు.జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావుపై మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అయ్యారు.
పోటాపోటీగా వినతిపత్రాలు ఇవ్వడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇరు వర్గాలు వినతిపత్రాలు సమర్పించిన నేపథ్యంలో అధికారులు ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం పక్కన పెట్టారని తెలుస్తోంది.







