యూపీఎస్సీ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదనే సంగతి తెలిసిందే.యూపీఎస్సీ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడం కోసం ఎంతోమంది రేయింబవళ్లు కష్టపడుతున్నారు.
అయితే విధు శేఖర్( IAS Vidhu Shekhar ) మాత్రం తన టాలెంట్ తో యూపీఎస్సీ సివిల్స్ లో ( UPSC Civils ) ఏకంగా 54వ ర్యాంక్ సాధించారు.అంకిత భావంతో పని చేస్తే సక్సెస్ సాధించడం కష్టం కాదని విధు శేఖర్ ప్రూవ్ చేశారు.
విధు శేఖర్ తండ్రి పేరు నిషిత్ రాయ్ కాగా ఆయన వైస్ ఛాన్స్ లర్ గా పని చేస్తున్నారు.
తల్లి అనితా రాయ్( Anitha Roy ) గృహిణిగా ఉన్నారు.
లక్నోలోని లామార్టినియర్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన విధు శేఖర్ ఐఐటీ అలహాబాద్( IIT Allahabad ) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.బీటెక్ పూర్తైన తర్వాత విధు శేఖర్ ఉద్యోగాన్ని మొదలుపెట్టారు.ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధు శేఖర్ పని చేయడం గమనార్హం.2020 యూపీఎస్సీ ఫలితాలలో విధు శేఖర్ కు 54వ ర్యాంక్ వచ్చింది.విధు శేఖర్ రోజుకు 8 గంటల పాటు ప్రిపరేషన్ ను కొనసాగించారు.

కరోనా సమయంలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిపరేషన్ విషయంలో అంతరాయం కలిగింది.ఆ సమయంలో ఆన్ లైన్ లో విధు శేఖర్ ప్రిపేర్ అయ్యారు.మెయిన్ పరీక్ష కోసం ట్యుటోరియల్స్ పై కూడా ఆధారపడ్డారు.
ఇతర సబ్జెక్ట్ ల టీచర్లు కూడా అతనికి మద్దతు ఇవ్వడంతో విధు శేఖర్ సెల్ఫ్ ప్రిపరేషన్ ను( Self Preparation ) మొదలుపెట్టారు.

కెరీర్ ను పణంగా పెట్టి కష్టపడిన విధు శేఖర్ చివరికి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అయితే పొందారు.ఆత్మ విశ్వాసం ఉంటే ఆలస్యంగా అయినా కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని ప్రూవ్ అయింది.విధు శేఖర్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.







