ఇంకా చెప్పాలంటే తీర్థం తీసుకున్న తర్వాత చాలామంది తమ కుడిచేతిని తలపై పెట్టుకుంటూ ఉంటారు.
కానీ ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు.ఎందుకంటే బ్రహ్మదేవుడు తల పై ఉన్నాడు.
ఇలా చేయడం వల్ల మనం బ్రహ్మ దేవు( Lord Brahma )ని అవశేషాలను తాకుతాము.
అందుకే తీర్థం సేవించిన తర్వాత చేతులు రుద్దకూడదు.అలాగే కొన్ని చోట్ల మూడుసార్లు తీర్థం తీసుకోవాలని చెబుతూ ఉంటారు.
ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు.మొదటిసారిగా అందించే తీర్థం శరీరక మరియు మానసిక శుద్ధి కోసం సమర్పిస్తారు.
రెండవసారి న్యాయ ధర్మా ప్రవర్తన సరిగ్గా ఉండాలని తీసుకుంటూ ఉంటారు.మూడవసారి పవిత్రమైన భగవంతుని యొక్క సర్వోన్నత వాక్యాన్ని ఆలోచించి తీర్ధాన్ని తీసుకోవాలనీ పండితులు చెబుతున్నారు.