మన కోరికలను త్వరగా తీర్చే దైవం ఎవరో మీకు తెలుసా?

హిందూ సంప్రదాయంలో సకల దేవతా గణములకు వినాయకుడు అధిపతి గణనాయకుడు, గణపతి, గణేశుడు.అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు,అన్నికార్యములకూ, అన్ని పూజలకూ మొదటగా పూజలు అందుకుంటారు.

చదువు, జ్ఙానానికీ,విజయానికి ప్రతీక వినాయకుడు.వినాయకుణ్ణి పూజించి ఏదైనా కార్యం తలపెడితే వెంటనే జరగటమే కాకుండా ఎటువంటి విఘ్నలు ఉండవు.

వినాయకుడు త్వరగా అనుగ్రహించే దేవుడు.గ- అంటే బుద్ధి, ణ- అంటే జ్ఞానం గణాధిపతి అయిన వినాయకుడు ‘బుద్ది’ని ప్రసాదిస్తే, సిద్ధి తనకు తానుగా ప్రాప్తించగలదు.

త్రిపురాసురుని సంహరించిన శివుడు, మహిషాసురుని మర్దించిన పార్వతీదేవి ఇద్దరూ కూడా వినాయకుని సేవించి విజయాన్ని పొందిన వారేనని గుర్తుంచుకోవాలి.

"""/" / శ్రీమహా విష్ణువు పరిపూర్ణ మానవుడిగా అవతారమెత్తిన శ్రీరాముడు, కృష్టుడు గణనాథుని ఆరాధించి తమ పనులను నిరాటంకంగా సాధించుకున్నారు.

అలాగే దేవతా సమూహంలో గణపతికి విశిష్టమైన స్థానం ఉంది.అందుచేత భక్తులు 11, 16, 21, 27, 32 మంగళవారాల పాటు స్వామి దర్శం చేసుకుని ప్రదక్షిణలు చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని పండితులు చెప్పుతూ ఉంటారు.

ఏపీలో ఆ మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇస్తారా.. తప్పు అస్సలు జరగదంటూ?