ఏపీలో కొత్త వివాదం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వివాదం రాజుకుంది.దీని పర్యవసానాలు ఎలా ఉంటయో ఇప్పుడే చెప్పలేం.

 The Name Game Over Kadapa-TeluguStop.com

ఉమ్మడి రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందిన తరువాత ఆయన సొంత జిల్లా కడపకు ఆయన పేరు జత చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఆ జిల్లా పేరు ప్రభుత్వ రికార్డుల్లో వైఎస్‌ఆర్‌ కడప జిల్లాగా మారింది.

జనం ఆ విధంగా పిలవకపోయినా సర్కారు రికార్డుల్లో మాత్రం వైఎస్‌ఆర్‌ కడప జిల్లా అని రాస్తారు.కాంగ్రెసు ప్రభుత్వం పెట్టిన ఈ పేరు ఇప్పుడు టీడీపీ నాయకులకు నచ్చడంలేదు.

వైఎస్‌ఆర్‌ పేరు తీసేసి కేవలం కడప జిల్లా అని వ్యవహరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.పార్టీ జిల్లా మహానాడులో ఈ మేరకు తీర్మానం చేసి హైదరాబాదులో ప్రారంభమైన మహానాడుకు పంపారు.

కడపను తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ‘గడప’గా భావిస్తారని, దీనికి రాజకీయ నాయకుడి పేరు జత చేయడం సమంజసం కాదని వారు తీర్మానంలో పేర్కొన్నారు.వైఎస్‌ఆర్‌ హిందువు కాదనే (క్రిస్టియానిటీ పుచ్చుకున్నారు కదా) భావన కూడా ఉండొచ్చు.

ఈ చర్య సహజంగానే వైకాపాకు ఆగ్ర హం కలిగిస్తుంది.మరి దీనిపై ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube