టిడిపి, జనసేనకు మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఛాలెంజ్

లోకేష్, పవన్ కల్యాణ్ కి అనిల్ కుమార్ సవాల్.2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా.యాత్రలో లోకేష్ ప్రకటించగలరా.లోకేష్ పాదయాత్ర పూర్తయ్యలోపు టిడిపి తడిగుడ్డ వేసుకొని ఇంట్లో ఉంటుంది.పవన్ కళ్యాణ్ కనీసం మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో అయినా పోటీ చేస్తారా…సింగిల్ గా పోటీ చేసే సత్తా లేని వీళ్లా జగన్ గురించి మాట్లాడేది.మాకు పొత్తులు అవసరం లేదు.

 Former Minister Anil Kumar Yadav Challenges Tdp And Janasena , Anil Kumar Yadav-TeluguStop.com

అప్పుడూ ఇప్పుడూ మేము సింగిల్ గానే పోటీ చేస్తాం.టిడిపి, జనసేన కు ఆ సత్తా ఉందా?సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.ఉద్యోగాల్లో మా హయాంలో వచ్చిన అవకాశాలు గతం కంటే ఎక్కువ.

ఒటర్లు ఉపాధ్యాయుల, పట్టభద్రుల అభ్యర్థులు ఘన విజయం ఖాయం.

ప్రజల్ని ధైర్యంగా ప్రజల్లోకి పంపే ఒకే ఒక్క సీఎం జగన్.మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

దమ్ము ధైర్యం ఉంటే జనసేన, టిడిపి 175 స్థానాలకు విడిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు.లోకేష్ పాదయాత్ర ముగిసే నాటికి టిడిపి తడిగుడ్డ నెత్తిన వేసుకోవడం ఖాయం అంటూ ఆయన జోష్యం చెప్పారు.

ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని ఆయన అన్నారు.ఇవాళ నెల్లూరులోని సిటీ వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడారు.

ప్రతిపక్ష పార్టీలకు రానున్న సార్వత్రిక ఎన్నికలపై పదేపదే ఆయన సవాళ్లు విసిరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube