మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మరి కొందరికి నోటీసులు జారీ చేశారు.
వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు వైఎస్ అవినాశ్ రెడ్డిని కలిసేందుకు ఇంటికి వచ్చిన ఐదుగురికి సీబీఐ నోటీసులు అందజేశారు.ఈ మేరకు కడప సెంట్రల్ జైలులో విచారణకు రావాలంటూ నోటీసులలో పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే.