బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ‘లెజెండ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.‘లెజెండ్’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గత సంవత్సరం విడుదలైన ‘లెజెండ్’ బాలయ్య కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది.అలాంటి సినిమాలో నటించిన సోనాల్ చౌహాన్‌కు వరుసగా ఆఫర్లు రావాల్సి ఉంది.
కాని అనూహ్యంగా ఈమెకు పెద్దగా ఆఫర్లు వచ్చింది లేదు.అయితే ప్రస్తుతం ఈమె మూడు సినిమాల్లో నటించింది.
ఆ మూడు సినిమాలు త్వరలో విడుదలకు సిద్దం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ అమ్మడు తన ఆశలన్నీ కూడా ఆ సినిమాలపైనే పెట్టుకుంది.
అయితే ఆ మూడులో రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించగా మరో సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటించింది.రామ్ ‘పండగ చేస్కో’ సినిమాలో ఈ అమ్మడు నటించింది.
ఈ సినిమా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైజ్ జీరో’లో ఈ అమ్మడు నటిస్తోంది.
అందులో ముఖ్య పాత్రలో నటిస్తోంది.ఇక కళ్యాణ్ రామ్ ‘షేర్’ సినిమాలో హీరోయిన్‌గా ఈమె నటిస్తోంది.
ఈ మూడు సినిమాల తర్వాత అయినా తనకు టాలీవుడ్‌లో క్రేజ్ పెరుగుతుందేమో అని ఆశలు పెట్టుకుంది.మరి ఈ అమ్మడు కోరుకున్నట్లుగా జరుగుతుందో లేదో చూడాలి.