పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో మూడు రోజుల్లో ‘గబ్బర్‌సింగ్`2’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు.చాలా కాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.అయితే ఇకపై ఏమాత్రం గ్యాప్ ఇవ్వ కూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.‘గబ్బర్‌సింగ్`2’ చిత్రీకరణ పూర్తి కాకుండానే దాసరి నిర్మాణంలో సినిమాలో నటించేందుకు పవన్ ఓకే చెప్పాడు.ఇప్పటికే దాసరి, పవన్ కళ్యాణ్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది.
పవన్, దాసరిల సినిమాకు ‘గోపాల గోపాల’ ఫేం డాలీ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది.అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది లేదు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ సినిమాకు డాలీని దర్శకుడిగా దాసరి ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.ఇందుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
‘గోపాల గోపాల’ ఆడియో వేడుక సమయంలోనే డాలీతో తాను మరో సినిమా చేయాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ చెప్పాడు.ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఈ సినిమాను డాలీ దర్శకత్వంలో చేయబోతున్నాడు.
పవన్ కోసం రెండు కథలను దాసరి ఫైనల్ చేసి పెట్టడం జరిగింది.ఆ రెండు కథల్లోంచి ఒక కథను పవన్ ఎంచుకోనున్నాడు.
ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.







