ప్రధాని నరేంద్ర మోదీ భారత పారిశ్రామికవేత్తలను, వ్యాపార దిగ్గజాలను పట్టించుకోవడంలేదా? వారితో మాట్లాడటంలేదా? దేశాభివృద్ధి విషయంలో వారిని సంప్రదించడంలేదా? …ఇలాంటి ప్రశ్నలకు ‘అవును’ అని సమాధానం వస్తోంది.మోదీ ఏడాది పాలనపై ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు పెదవి విరిచాయి.
వ్యాపారులు నిరుత్సాహంగా ఉన్నారు.ఆయనకు విదేశీ సిఇవోలంటేనే మోజుగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
విదేశీ సిఈవోలను కలుసుకుంటున్న ప్రధాని మోదీ భారత సిఈవోలను ఎందుకు కలుసుకోవడంలేదు? అని సూటిగా ప్రశ్నించారు హెచ్‌ఎస్‌బిసి (ఇండియా) జనరల్ మేనేజర్, కంట్రీ హెడ్ నైనా లాల్ కిద్వాయ్.భారత పారిశ్రామిక రంగంతో మోదీ సంబంధాలు చాలినంతగా లేవన్నారు.
ఇక్కడి పారిశ్రామికవేత్తలను పక్కకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని విదేశీ కంపెనీల సిఈవోలను ఒప్పిస్తున్నారని, కాని అదే పని స్వదేశీ సిఈవోలతో చేయడంవలేదని కిద్వాయ్ అన్నారు.
విదేశీ సిఈవోలను మాత్రమే కలుసుకోవడం క్రోనీ కేపిటలిజం (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) కాదా? అని ప్రశ్నించారు.కిద్వాయ్ చెప్పినదాంట్లో అవాస్తవం ఏమీ లేదు.
కేంద్రంలో మోదీకి, తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులకు విదేశీ పిచ్చి బాగా పట్టుకుంది.