టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా రోడ్ షోలో ప్రసంగాలు చేస్తూ ఉన్నారు.
పార్టీని నాయకులు విడిచిపెట్టగానే కార్యకర్తలు విడిచి పెట్టలేదు అని.టీడీపీకి.కార్యకర్తలే బలమని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో రోడ్ షోలో కొంత మంది తెలుగుదేశం పార్టీ క్యాడర్కు చెందిన వాళ్ళు…పవన్ తో కలిసి వెళ్లొచ్చు కదా అంటూ.బాబునీ అందరూ చూస్తుండగానే మైకులో కార్యకర్త ప్రశ్నించగా… ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలని చంద్రబాబు బదులిచ్చారు.
దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పని చేయడానికి సిద్ధమే అన్న తరహాలో సమాధానమిచ్చారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు పవన్ అంతర్గతంగా కలిసి ఉన్నట్లు… సరిగ్గా వచ్చే ఎన్నికలకు ముందు ఇద్దరు కలవనున్నట్లు వైసీపీ నాయకులు ఎప్పటి నుండో ఆరోపిస్తూ ఉన్నారు.ఇటువంటి తరుణంలో బాబు కుప్పం పర్యటన లో పవన్ తో పనిచేయడం విషయంలో.సానుకూలంగానే కామెంట్ చేయటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.2014 ఎన్నికలలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయగా టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది.ఆ తర్వాత 2019 ఎలక్షన్ లో.రెండు పార్టీలు విడిపోగా అధికారం కోల్పవడం తెలిసిందే.కాగా ప్రస్తుత పరిస్థితిలో జగన్ ని వచ్చే ఎన్నికలలో ఓడించాలంటే మళ్ళీ టీడీపీ-జనసేన కలిసి పోటీచేయాల్సిందే అనే టాక్ వైసీపీ వ్యతిరేక వర్గాల నుండి వినిపిస్తోంది.