Priya Bhavani Shankar : సినిమా ఆఫర్ల కోసం అలా చేయాల్సిన అవసరం రాలేదు.. నటి షాకింగ్ కామెంట్స్!

సినిమాల్లో ఆఫర్లు రావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కు కచ్చితంగా ఓకే చెప్పాల్సిందేనని ఇండస్ట్రీ గురించి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.కొంతమంది స్టార్ హీరోయిన్లు సైతం తమకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని అయితే ఆ ఆఫర్లకు తాము ఓకే చెప్పలేదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

 Priya Bhavani Shankar Remuneration Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అయితే తాజాగా నటి ప్రియా భవానీ శంకర్( Priya Bhavani Shankar ) ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

టీవీ యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ హీరోయిన్ అంతకంతకూ ఎదిగి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.ఇతర భాషల్లో కూడా ఈ బ్యూటీకి ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.2017 నుంచి తమిళ సినిమాలతో విజయవంతంగా ఈ బ్యూటీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.తాజాగా ఈ బ్యూటీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రియా భవానీ శంకర్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో ఈమెకు క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. శింబుకు( Silambarasan TR ) జోడీగా ఈ బ్యూటీ పత్తు తల( Pathu Thala ) అనే సినిమాలో నటించగా ఈ నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.వరుసగా సినిమాల్లో ఆఫర్లు రావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

తనకు ఇప్పటివరకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు.

తనకు తెలిసి సినిమా రంగంలో ఆ సమస్య లేదని ప్రియా భవానీ శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.టాలీవుడ్ సినిమాలతో కూడా ఈ బ్యూటీ బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.భాషతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం ఈ బ్యూటీ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube