మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25, 2022 న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా తో చరణ్ రేంజ్ మారిపోబోతుంది.పాన్ ఇండియా స్టార్ గా రెట్టింపు ఇమేజ్ సొంతం చేసుకోవడం ఖాయం.
ఇప్పటికే చరణ్ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.
అయితే ఇప్పుడు మరొక బ్రాండ్ ను తన ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తుంది.
ఫ్రూటీ బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ ను ఎంపిక చేసారని టాక్.ఇప్పటి వరకు ఈ బ్రాండ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉండేవాడు.
పాన్ ఇండియా చిత్రం పుష్ప సక్సెస్ తో అల్లు అర్జున్ ఇమేజ్ రెట్టింపు కావడంతో పాటు పలు బ్రాండ్ లకు కూడా సైన్ చేసాడు.అయితే ఈయన చేస్తున్న ఫ్రూటీ బ్రాండ్ చరణ్ చేతిలోకి వెళ్ళిపోయింది.

అల్లు అర్జున్ సౌత్ లో ఫ్రూటీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించారు.అయితే ఇప్పుడు చరణ్, ఆలియా భట్ జంటతో ఈ యాడ్ చేయించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.ఆర్ ఆర్ ఆర్ సినిమా వల్ల ఈ జంట క్రేజ్ విపరీతంగా పెరిగింది.ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఫ్రూటీ యాజమాన్యం చూస్తుంది.అందుకే వీరితో ఈ యాడ్ ను చేయించాలని ఫిక్స్ చేశారట.

ఇప్పటికే షూటింగ్ పూర్తి అయ్యింది.త్వరలోనే వీరిద్దరూ కలిసి నటించిన యాడ్ ప్రసారం కాబోతుంది.ఈ యాడ్ షూట్ భాగంగానే చరణ్ ముంబై వెళ్లినట్టు టాక్.
దీంతో పాటు చరణ్ మరికొన్ని సంస్థలకు కూడా ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది.చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఆచార్య సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది.
ఇక ప్రెసెంట్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15 సినిమా చేస్తున్నాడు.