నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని బాలయ్య చూస్తున్నాడు.ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్ కోసం దర్శకుడు బోయపాటికి చిత్ర నిర్మాత ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించడంతో ఈ సినిమాకు పరిమిత బడ్జెట్‌ను కేటాయించాలని నిర్మాత తెలిపాడట.అటు అనవసరమైన ఖర్చులను తగ్గించాలని చిత్ర యూనిట్‌కు బోయపాటి ఆర్డర్ కూడా వేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య రైతు పాత్రతో పాటు అఘోరా పాత్రలో నటిస్తుండటంతో, ఆయన లుక్స్ ఎలా ఉంటాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా సీనియర్ బ్యూటీని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు తొలుత మోనార్క్ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావించగా, ఇప్పుడు ఈ సినిమాకు టార్చ్ బేరర్ అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.మరి ఈ సినిమా పూర్తయ్యే సరికి ఎంతమేర బడ్జెట్ ఖర్చవుతుందో చూడాలి.
ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాలయ్య భావిస్తున్నాడు.