వైసీపీ ఇంఛార్జుల( YCP Incharges ) మార్పుల జాబితా ఇవాళ రాత్రికి విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు ఐదో లిస్టుపై( Fifth List ) వైసీపీ కసరత్తు పూర్తి చేసింది.
ఈ జాబితాలో భాగంగా పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జులను వైసీపీ అధిష్టానం ప్రకటించనుంది.
ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి,గుంటూరు, నరసరావుపేట, అనకాపల్లి, మచిలీపట్నం, నరసాపురంతో పాటు నంద్యాల ఎంపీ స్థానాలకు ఇంఛార్జులను ప్రకటించే అవకాశం ఉంది.10 స్థానాలకు ఇంఛార్జులను ప్రకటించనున్న వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించనుందని సమాచారం.