కష్టానికి ప్రతిఫలం అందుకున్న కూలీ.. ఒక్క రాత్రిలోనే..!

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు.ఇలాంటి సమయంలో మనకు ఒక సామెత కూడా గుర్తుకు వస్తుంది.

 Labourer In Madhya Pradesh Find Diamond Worth 20 Lakh Details, Diamond,madhyapra-TeluguStop.com

అది ఏంటంటే.అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరని అంటూ ఉంటారు.

ఇది సరిగ్గా నిజమే.ఒక వ్యక్తికి అదృష్టం వచ్చి తలుపు కొట్టి మరి పిలిచింది.

రాత్రికి రాత్రే అతడి లైఫ్ పూర్తిగా మారిపోయింది.

అతడు అన్ని రోజుల నుండి పడుతున్న కష్టాన్ని ఒక్క రోజులోనే మర్చిపోయే అంత సంతోషం అతడికి వచ్చింది.

ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా అనగానే అందరికి వజ్రాలు మాత్రమే గుర్తుకు వస్తాయి.

ఆ ప్లేస్ వజ్రాలకు అంత ఫేమస్.అక్కడ వజ్రాల గనులు ఉన్నాయి.

హీరాపూర్ తపరియన్ ప్రాంతంలో వజ్రాల గనులు ఎక్కువుగా ఉన్నాయి.

ఆ ప్రాంతంలో ఎప్పుడు వందలాది మంది కూలీలు వజ్రాల కోసం తవ్వకాలు చేస్తూనే ఉంటారు.

ఇలా కూలీలా తవ్వకాల్లో వజ్రాలు దొరికితే వారికి అదృష్టం కలిగినట్లే.ఎందుకంటే ఆ వజ్రాల విలువ ఎంత పలుకుతుందో అంత ప్రభుత్వం కూలీలకే ఇచ్చేస్తుంది.

దీంతో వజ్రాలు దొరికిన కూలీ రాత్రికి రాత్రే లక్షాధికారి అవవడం ఖాయం.తాజాగా ఇలానే ఒక కూలీకి అదృష్టం కలిసి వచ్చింది.

Telugu Rupees Diamond, Wage Workde, Diamond, Labourermadhya, Madhyapradesh, Pann

తాను ఎప్పటి నుండి వజ్రాల వేటలో ఉన్నాడు.ఇన్నాళ్లు శ్రమించిన శ్రమ అంత ఒక్క రోజులోనే మర్చిపోయే విధంగా అతడికి అదృష్టం కలిసి వచ్చింది.ఇందులో పనిచేసే శంషేర్ ఖాన్ కు వజ్రాల గనిలో ఒక వజ్రం దొరికింది.ఆ వజ్రం 6 క్యారెట్ల 66 సెంట్ల బరువు ఉంది.దీన్ని అతడు ప్రభుత్వానికి అందించాడు.ఆ వజ్రాన్ని ప్రభుత్వం వేలం వేస్తుంది.

ఆ వేలం పాటలో వచ్చిన డబ్బును కూలీలకు ఇచ్చేస్తుంది.ఇక ఇతడి వజ్రం 20 లక్షల రూపాయలు పలికింది.

దీంతో అతడి అదృష్టం తలపు తట్టి రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube