సాధారణంగా మనకు వేట అనగానే ఎక్కువగా పులి లేదా సింహం మాత్రమే గుర్తుకు వస్తాయి.అడవిలో వీటి వేటకు ఎదురుండదనే చెప్పాలేమో.
పులి వేటాడితే తప్పించుకోవడం, చిరుత వేగం నుంచి ప్రాణాలను కాపాడుకోవడం అంత ఈజీ కాదనే చెప్పాలి.మరి డేగ దాడి చేస్తే అది మెరుపు కన్నా వేగంగా ఉంటుందనేది మనకు తెలిసిందే.
విద్యుత్‌తో సమానంగా ఉండే దాడి డేగ సొంతం అనే చెప్పాలి.అందుకే దాని దాడిని మెరుపు దాడి అని చెప్తుంటారు.
ఇక ఇప్పుడు కూడా దాని దాడి గురించే మనం చెప్పుకోబుతున్నాం.
కాకపోతే ఈ వీడియోలో మాత్రం డేగ దాడి కాస్త రివర్స్ అవుతుందనే చెప్పక తప్పదు.
డేగ దాడి చేస్తున్న సమయం కాస్తా తప్పడంతో దాని వేట నుంచి ఎర తప్పించుకుంది.మరి ప్రతిసారి విధి ఒకేలటా ఉండదు కదా.అందుకే ఈ సారి కాస్త రివర్స్ అవుతుంది.ఇక ఇప్పుడు ఈ డేగ దాడికి సంబంధించిన వీడియో ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో దాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం.
వాస్తవానికి డేగ ఎల్లప్పుడూ తన ఎరను ఎంతో ప్లాన్ వేసి మరీ ఓపికగా వెతుకుతూ అవకాశం రాగానే మెరుపు వేగంతో దాడి చేస్తుందని తెలిసిందే.
ఇక ఇప్పుడు కూడా ఓ డేగ ఎంతో ఓపికగా ఎదురు చూసి చివరకు ఓ గొర్రెపై దాడి చేస్తుంది.
నిజానికి పర్వత ప్రాంతాల్లో తిరిగే గొర్రెలపై డేగలు వేటాడటం కామన్.ఎందుకంటే ఎత్తైన ప్రదేశం నుంచి పడేస్తే అవి చనిపోతాయనేనది డేగలకు తెలిసిందే.ఇక ఇప్పుడు ఓ డేగ ఇలాగే పర్వతాల్లో మేస్తున్న గొర్రెపై దాడి చేసినప్పుడు ఆ గొర్రె పారిపోవడానికి ఎంతగానో విపరీతంగా ప్రయత్నించడం చూడొచ్చు.మరి డేగ ఏమైనా పట్టు విడుస్తుందా.
చివరకు డేగ పట్టు మాత్రం కోల్పోవడం ఎర తప్పించుకోవడం మనం చూడొచ్చు.