టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఓ రేంజ్ లో వరుస సినిమాలతో బాగా దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఆయన ఖాతాలో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా.ఇందులో మరో యంగ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.
ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదిలా ఉంటే శంకర్ దర్శకత్వంలో మరో సినిమా ఉండగా.తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది.
రోబో, భారతీయుడు, జెంటిల్మెన్ వంటి పలు సినిమాలలో దర్శకత్వం వహించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు క్రేజీ డైరెక్టర్ శంకర్.ఇక ఈయన దర్శకత్వంలో రానున్న సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించనున్నట్లు గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటించగా మెగా అభిమానులు మాత్రం తెగ సంతోషపడుతున్నారు.ఈ సినిమా గురించి ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.
![Telugu Dil Raju, Kiara Advani, Oke Okkadu, Pan India, Drop, Ram Charan, Shankar- Telugu Dil Raju, Kiara Advani, Oke Okkadu, Pan India, Drop, Ram Charan, Shankar-](https://telugustop.com/wp-content/uploads/2021/08/the-latest-update-of-director-shankar-and-ram-charan-movie-shootingg.jpg )
పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ అని గతంలో టాక్ వినిపించగా.మొత్తానికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలిసింది.ఈ సినిమాకు మూల కథను యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, మాటలను మాధవ్ బుర్ర అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇందులో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మొదట తెలంగాణలో చెయ్యాలని అనుకున్నారట.
![Telugu Dil Raju, Kiara Advani, Oke Okkadu, Pan India, Drop, Ram Charan, Shankar- Telugu Dil Raju, Kiara Advani, Oke Okkadu, Pan India, Drop, Ram Charan, Shankar-](https://telugustop.com/wp-content/uploads/2021/08/the-latest-update-of-director-shankar-and-ram-charan-movie-shootings.jpg )
ఆ తర్వాత మిగతా భాగం విదేశాలలో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక వచ్చే సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మొత్తానికి ఆచార్య, ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ సినిమాకు సిద్ధంగా ఉన్నాడు రామ్ చరణ్.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించనుంది.ఇందులో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించనున్నాడు.
ఇక దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.