బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పై ఆనందంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడిప్పుడే బిజెపి అసలు ఎజెండా అర్థం అవుతోంది.ముందుగా జనసేన పార్టీని బీజేపీ లో విలీనం చేయాల్సిందిగా కోరినా ఆయన ససేమిరా అనడంతో తాత్కాలికంగా ఆ ప్రతిపాదనను పక్కన పెట్టి కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అందుకే కొద్దిరోజుల క్రితం అకస్మాత్తుగా ఢిల్లీకి రావాలని పవన్ కళ్యాణ్ సమాచారం అందించారు.దీంతో ఒక్కసారిగా జనసేనలో హడావుడి కనిపించింది.
తమ అధినేతను బిజెపి వారే కావాలని ఢిల్లీకి పిలిచారని, జనసేన పార్టీ తో పొత్తు బీజేపీ వారే పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని గట్టిగా ప్రచారం చేశారు.కానీ ఢిల్లీ వెళ్ళాక కానీ అసలు విషయం బయట పడలేదు.
దీంతో మీడియా ముందుకు వచ్చేందుకు భయపడి పవన్ ముఖం చాటేశారు.

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తో పవన్ భేటీ అయ్యాక ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి మాత్రమే అంటూ పవన్ గట్టిగా చెప్పారట.అయితే రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో మూడు రాజధాని విషయమై చర్చించలేదని, తమ దృష్టికి ఈ విషయం రాలేదని బిజెపి ముఖ్య నాయకులు ఒకరైన రామ్ మాధవ్ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ పేర్కొన్నారు.ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం అంటూ కేంద్రం పదేపదే చెబుతున్నా పవన్ మాత్రం బీజేపీతో కలిసి అమరావతిపై పోరాటం చేస్తామని చెబుతున్నారు.

అయితే బీజేపీ మాత్రం జనసేన ద్వారా ఏపీ లో రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది తప్ప ఆ పార్టీకి మైలేజ్ పెరిగే విధంగా బిజెపి ఎక్కడ వ్యవహరించలేదనే విషయం అర్ధం అవుతోంది.అందుకే ముందుగా పవన్ తో పొత్తు పెట్టుకున్నా మెల్లిమెల్లిగా పవన్ ను ఒప్పించి జనసేన పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేసే ప్రక్రియకు కేంద్ర బిజెపి పెద్దలు కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.ఒక్కసారిగా విలీనం అంటే పవన్ ఒప్పుకునే అవకాశం లేదు కాబట్టి ముందుగా పొత్తు అంటూ ఆయనను చేరదీశారనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.