తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే బండి సంజయ్ త్వరలో రెండో విడత పాదయాత్ర అనేది మొదలుపెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇక ఇప్పటికే కాంగ్రెస్ నుండి భట్టి విక్రమార్క పాదయాత్ర ఇప్పటికే మొదలు పెట్టడం, వైఎస్ షర్మిల పాదయాత్రను త్వరలోనే మొదలు పెట్టే అవకాశం ఉండనున్న నేపథ్యంలో ఇక వీరి జాబితాలో బండి సంజయ్ కూడా చేరే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.అయితే కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర అనేది టీఆర్ఎస్ కు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తోంది.
అయితే రెండో దఫా ఎన్నికల్లో కూడా పార్టీలన్నీ ఒక్కటై టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీ చేసినా కెసీఆర్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేసి అంతకు ముందు ఎన్నికల కంటే మెరుగైన స్థానాలను సాధించుకున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ మాత్రం ఇంకో ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామనే గట్టి నమ్మకాన్ని పలు బహిరంగ సభల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎంత మేరకు టీఆర్ఎస్ ను నిలువరించగలుగుతాయనేది చూడాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం బండి సంజయ్ రెండో విడత పాదయాత్రలో మరింత భిన్న వ్యూహంతో ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తోంది.దీంతో ఇక మరోసారి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల దాడి పెరిగే రాజకీయం వాతావరణం రణరంగంగా మారుతుంది.
అయితే బండి సంజయ్ పాదయాత్ర ఎప్పటి నుండి కరెక్ట్ గా మొదలవుతుందనే వివరాలు ఇప్పటి వరకు ఖచ్చితంగా రాకున్నా ఇక మొదలైన తరువాత పాదయాత్రపై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.మరి బండి సంజయ్ ఇక ఈ పాదయాత్రను ఇంకేం రూపంలోకి తీసుకెళ్తాడనేది చూడాల్సి ఉంది.