సాక్షి టీవీలో పనిచేసే కొమ్మినేని శ్రీనివాస్ రావుకి జగన్ ప్రభుత్వం పదవి అక్క చెప్పింది.ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
సాక్షి టీవీలో ప్రముఖ విశ్లేషకుడిగా రిపోర్టర్ గా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావుకి జగన్ ప్రభుత్వం ఈ పదవి అప్పజెప్పడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పత్రికా రంగంలో సీనియర్ జర్నలిస్ట్ గా కొమ్మినేని శ్రీనివాస్ కి మంచి పేరుంది.
సాక్షి టీవీలో పనిచేయకముందు ఎన్టీవీ ఛానల్ లో పనిచేసే వాళ్లు.వర్తమాన రాజకీయాలపై తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తూ.
ఉంటారు.
కాగా కొద్దిరోజుల క్రితం నటుడు ఆలీకి రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొద్ది గంటల క్రితం పోసాని కృష్ణ మురళికి ఏపీ ఫిలిం చైర్మన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని అప్పజెప్పింది.తాజాగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావునీ జగన్ ప్రభుత్వం నియమించడం జరిగింది.