టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కి ఇది పండగ లాంటి వార్త.ఖచ్చితంగా కాజల్ అభిమానులంతా కూడా చాలా సంతోషించే విషయం ఇది.
టాలీవుడ్ కి చెందిన ప్రముఖ స్టార్ హీరో చేయబోతున్న ప్రతిష్టాత్మక సినిమా లో చందమామ కాజల్ అగర్వాల్ కి ఛాన్స్ దక్కినట్లుగా సమాచారం అందుతుంది.ఆ హీరో తో గతం లోనే కాజల్ ఒక సినిమా ను కూడా చేసింది.
ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పుడు మరో సారి కాజల్ తో ఆయన రొమాన్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట.
అయితే ఈ మధ్యకాలంలో కాజల్ పెళ్లి చేసుకోవడంతో పాటు తల్లి కూడా అయింది.దాంతో ఆమె కెరియర్ పూర్తయినట్లే అని చాలా మంది భావిస్తున్నారు.
ఈ సమయంలో ఆ సీనియర్ స్టార్ హీరో ఈమెను పిలిచి మరీ అవకాశము ఇవ్వడం తో కాజల్ కెరియర్ ఖతం అవ్వలేదని.ఇంకా చాలా కాలం కొనసాగే అవకాశం ఉందని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తల్లి అయినా కూడా కాజల్ అగర్వాల్ అందం విషయం లో ఏ మాత్రం తగ్గడం లేదని, గతంతో పోలిస్తే ఇంకాస్త ఎక్కువ అందంగానే కాజల్ అగర్వాల్ కనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు మాట్లాడుకుంటున్నారు.కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా విడుదలైన తర్వాత కచ్చితం గా పలు భాషల్లో ఆఫర్స్ రావడం ఖాయం అనే నమ్మకం తో కాజల్ అగర్వాల్ మరియు ఆమె సన్నిహితులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.ఈ సమయంలోనే టాలీవుడ్ నుండి ఆమె కు ఈ ఆఫర్ రావడం తో ఉబ్బి తప్పిపోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
ఫుల్ జోష్ లో కాజల్ అగర్వాల్ కనిపించింది.స్టార్ హీరోలకు జోడి గా ఇంకా నటించే అవకాశాలు దక్కించుకుంటుందంటే ఖచ్చితంగా అది అందాల చందమామ కాజల్ అగర్వాల్ యొక్క గొప్పతనం అన్నట్లుగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.