నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల పరిధిలోని రంగం తండా, అజ్మీరాతండా వాసులు ఓటింగ్ ను బహిష్కరించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తండా వాసులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
కేటీఆర్ తో మాట్లాడిన అనంతరం ఓటు వేసేందుకు తండాల ఓటర్లు ముందుకు కదిలారు.అంతకముందు తమ సమస్యలు పరిష్కరించాలంటూ పోలింగ్ ను బహిష్కరించారు.
ఈ క్రమంలో చొరవ తీసుకున్న టీఆర్ఎస్ నేతలు మంత్రితో మాట్లాడే అవకాశం కల్పించారు.తండాల బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇవ్వడంతో రెండు తండాల్లోని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు.







