ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అనే సంగతి తెలిసిందే.విద్యార్థుల సక్సెస్ లోనే తమ సక్సెస్ ఉంటుందని గురువులు భావిస్తారు.
అయితే టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది వెండితెరపై గురువుల పాత్రల్లో నటించి ఆ పాత్రలతో మెప్పించడంతో పాటు భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాసిక్ గా నిలిచిన సినిమాలలో బడిపంతులు మూవీ కూడా ఒకటి.
ఉపాధ్యాయుల జీవితాలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది.
సీనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించగా గురువు, శిష్యుల మధ్య అనుబంధాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు.
దారి తప్పిన శిష్యులను గురువు సరైన మార్గంలో పెట్టాలని చూపించిన సినిమా సుందరకాండ.గురువు ఎంత పవిత్రంగా ఉండాలో ఈ సినిమాలోని వెంకటేష్ పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు.
విద్యార్థులు ఎన్ని తప్పులు చేసినా వారిని సరైన మార్గంలోకి తీసుకురావడం గురువు వల్లే సాధ్యమవుతుందని చిరంజీవి మాస్టర్ సినిమాతో ప్రూవ్ చేశారు.
రియల్ లైఫ్ లో కూడా తమకు ఇలాంటి మాస్టర్ ఉంటే బాగుంటుందనేలా చిరంజీవి నటించారు.

సై సినిమాలో మాటలతో జట్టు సభ్యుల్లో స్పూర్తిని రగిలించే శిక్షకుడి పాత్రలో రాజీవ్ కనకాల ఒదిగిపోయి నటించారు.ప్రతిఘటన మూవీలో లెక్చరర్ రోల్ లో స్త్రీల ఔన్నత్యం గురించి చెప్పడంతో పాటు స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాల గురించి విజయశాంతి పాత్ర ద్వారా అద్భుతంగా చూపించారు.సరిలేరు నీకెవ్వరు మూవీలో కూడా విజయశాంతి లెక్చరర్ పాత్రలో నటించారు.

కొత్త బంగారు లోకం సినిమాలో లైఫ్ ను భిన్నంగా చూడాలని విద్యార్థులకు చెప్పే పాత్రలో రావు రమేష్ నటించారు.రావు రమేష్ పోషించిన పాత్రను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు.చిరంజీవి ఠాగూర్ సినిమాలో కూడా లెక్చరర్ పాత్రను పోషించారు.
ఓనమాలులో రాజేంద్ర ప్రసాద్, గీతా గోవిందంలో విజయ్ దేవరకొండ సింహాలో బాలకృష్ణ, మిరపకాయ్ లో రవితేజ ప్రేమమ్ లో శృతిహాసన్, ఘర్షణలో అసిన్, ఖతర్నాక్ లో ఇలియానా, హ్యాపీడేస్ లో కమిలినీ ముఖర్జీ టీచర్ పాత్రలతో మెప్పించారు.