1.బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం
రాయలసీమ జిల్లాలో బీజేపీ బలోపేతం పై ఈ రోజు కర్నూల్ జిల్లాలో రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది.
2.జాతీయ లోక్ అదాలత్
ఈ నెల 11 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ తెలిపింది.
3.వైద్య అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ లో కొత్తగా ఏర్పాటు కాబోతుందని 8 వైద్య కళాశాలల్లో అధ్యాపకుల నియామకానికి వైద్యశాఖ కసరత్తు మొదలు పెట్టంది.దీనికి సంబంధించి వారంలో జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేయబోతోంది.
4.ఇన్ఫోసిస్ పై ఆర్ఎస్ఎస్ విమర్శలు
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన జిఎస్టి ఆదాయపన్ను పోర్టల్ మోరాయిస్తుండడం పై ఆర్ఎస్ఎస్ మండిపడింది.
5.త్వరలో రెడ్డి కార్పొరేషన్ : హరీష్ రావు

త్వరలోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పారు.
6.బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీలో వర్షాలు
ఉత్తర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
7.సిబిఐ విచారణకు జగన్ మేనమామ

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా కమలాపురం ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు.
8.కేరళలో నిఫా వైరస్ కలకలం
కేరళలోని కోజికోడ్ కు చెందిన 12 ఏళ్ల బాల్యంలోనే ఫర్ వైరస్ లక్షణాలు కనిపించడంతో కలకలం రేగింది.
9.జమ్ము కాశ్మీర్ లో సందర్శకులకు అనుమతి

జమ్ము కాశ్మీర్ లో సందర్శకులకు అనుమతిస్తున్నట్లు ఆ ప్రాంతాల పర్యాటక విభాగాలు ప్రకటించాయి.
10.ఆర్మీ జవాన్ అదృశ్యం
కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యమయ్యారు.
రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న కెంగర్ల నవీన్ కామారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి జోద్పూర్ వెళ్లేందుకు ఆగస్ట్ 29న హైదరాబాద్ బయలుదేరారు.ఆ తర్వాత ఆయన ఆచూకి లభించలేదు.
11.కాకినాడ బీచ్ లో యుద్ధ విమానాల మ్యూజియం
యుద్ధ విమానాల మ్యూజియం కాకినాడ బీచ్ లో త్వరలోనే ప్రారంభం కానుంది.
12.ఢిల్లీ లోనే కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా డిల్లీలోనే ఉన్నారు.ఈ రోజు, రేపు ఆయన బీజేపీ కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు.
13.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 46,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
14.మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
15.పంజ్ షేర్ లో 600 మంది తాలిబాన్లు మృతి

ఆఫ్ఘన్ లోని పంజ్ షేర్ లో 600 మంది తాలిబన్లు మృతి చెందారు.తాలిబన్లు రెసిస్టెన్స్ దళాలు మధ్య జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
16.ఏపీ ఆర్థిక పరిస్థితి పై మంత్రి స్పందన
ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ప్రకటన చేశారు.కరోనా కారణంగా రాష్ట్ర పరిస్థితి దెబ్బతిందని రాబడులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు.
17.తగ్గనున్న టీబీ, షుగర్, క్యాన్సర్ మందుల ధరలు

క్యాన్సర్ షుగర్ టీబీ రోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది.ఈ మందులకు సంబంధించిన ధరలను భారీగా తగ్గించే ఆలోచనలో ఉంది.
18.ఏపీ తెలంగాణ కు కొత్త వేరియంట్ భయం
ఏపీ తెలంగాణలో కొత్తరకం కరోనా వేరియంట్ ఏవై 12 రకం విస్తరిస్తున్న ట్లు వైద్య నిపుణులు హెచ్చరించారు.
19.పవన్ డబ్బులు నాకు వద్దు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు 2 లక్షలు పంపించారని, కానీ ఆ డబ్బులు నేను తీసుకోను అని, స్వయంగా పవన్ కళ్యాణ్ ను కలిసిన తరువాతే ఆ సొమ్ములు తీసుకుంటాను అంటూ ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు మోగలయ్య అన్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,410
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,410
.