తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అవికా గోర్( Heroine Avika Gor ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఉయ్యాలా జంపాలా.
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.కాగా హీరోయిన్ గా కంటె ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
చిన్నారి పెళ్లికూతురు( Chinnari Pelli Kuthuru ) సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అవికా గోర్.ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా సినిమాతో మరింత చేరువ అయ్యింది.
ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై కింగ్ హీరో నాగార్జున నిర్మించిన విషయం తెలిసిందే.

కాగా హీరోయిన్‌గా అవికా గోర్‌కు ఇది తొలి సినిమా కావడంతో నాగార్జున( Nagarjuna ) ఎంతో ప్రోత్సహించారట.ఆయన తన లక్కీ చార్మ్ అని అంటున్నారు అవికా గోర్.దర్శక నిర్మాత మహేష్ భట్ సమర్పణలో, ఆయన స్వీయ రచనలో రూపొందిన హిందీ హారర్ మూవీ 1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్.ఇందులో అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించారు.కృష్ణ భట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.విక్రమ్ భట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్, డా.రాజ్ కిషోర్ ఖవ్రే సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో ఈనెల 23న విడుదల కానుంది.ఈ సందర్బంగా అవికా గోర్ మీడియాతో మాట్లాడుతూ.నాగార్జున నా మొదటి సినిమా నుంచీ ఎంతో ప్రోత్సహిస్తున్నారు.

ఆయన నా లక్కీ చార్మ్.మొన్న నన్ను పాన్ వరల్డ్ స్టార్ అని అన్నారు.ప్రేమ, ఆప్యాయతతో చెప్పిన మాట అది.నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని తెలిపింది అవికా గోర్.కాగా ఈ సినిమాతో బాలీవుడ్‌లో మెయిన్ లీడ్‌గా పరిచయం కాబోతుంది.
దీనిపై అవికా గోర్ స్పందిస్తూ.మహేష్ భట్, విక్రమ్ భట్ లాంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌తో పని చేయడం నా కల.ఈ చిత్రం ద్వారా నా కల ఇంత త్వరగా నెరవేరడం నా అదృష్టం.ఈ సినిమా నాపై ఇంకా బాధ్యత పెంచింది.
ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను.లుక్, అప్పీరియన్స్ ఇలా ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను.
ఒక యూనిక్ హారర్ సినిమా ఇది అని చెప్పుకొచ్చింది అవికా గోర్.