అమెరికా : వైశాఖీ వేడుకల్లో పాల్గొన్న డెలావేర్ శాసనసభ్యులు.. సిక్కులతో కలిసి భాంగ్రా నృత్యం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు( America ) వెళ్లిన భారతీయులు మన సంస్కృతి, సంప్రదాయాలను అక్కడికి కూడా విస్తరిస్తున్నారు.భారత్‌లోని ప్రతి పండుగ ఇప్పుడు అమెరికాలోనూ ఒకే రోజు , ఒకే సమయంలో జరుగుతోంది.

 Us Delaware Legislators Perform Bhangra To Celebrate Vaisakhi Details, Us ,delaw-TeluguStop.com

తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వస్థలమైన డెలావేర్‌లో( Delaware ) ఏడుగురు సినీయర్ శాసనసభ్యుల బృందం వైశాఖి పర్వదినాన్ని( Vaisakhi ) జరుపుకోవడానికి సిక్కు కమ్యూనిటీతో చేరారు.ఈ సందర్భంగా భాంగ్రా నృత్యంలో( Bhangra Dance ) వీరు కూడా పాలుపంచుకున్నారు.

సంప్రదాయ పంజాబీ దుస్తులు ధరించి లయబద్ధంగా నృత్యాలు చేశారు.

ఈ శాసనసభ సభ్యుల బృందంలో డెలావేర్ సెనేట్ మెజారిటీ లీడర్ బ్రయాన్ టౌన్‌సెండ్,( Bryan Townsend ) సెనేట్ మెజారిటీ విప్ ఎలిజబెత్ లాక్‌మన్,( Elizabeth Lockman ) సెనేటర్ స్టెఫానీ హాన్సెన్, సెనేటర్ లారా స్టర్జన్ . రాష్ట్ర ప్రతినిధులు పాల్ బాంబాచ్, షెర్రీ డోర్సే వాకర్, సోఫీ ఫిలిప్స్ తదితరులు పాల్గొన్నారు.తమ భాంగ్రా కోచ్, ఇండియన్ అమెరికన్ విశ్వాస్ సింగ్ సోధి( Vishwas Singh Sodhi ) ఆధ్వర్వంలో దాదాపు 30 గంటల పాటు రెండు నెలలు ప్రాక్టీస్ చేశామని టౌన్‌సెండ్ తెలిపారు.

Telugu Bhangra, Bhangra Dance, Bryan Townsend, Delaware, Joe Biden, Punjabi Danc

విశ్వాస్ సింగ్‌ అద్భుతమైన కోచ్ అని ఆయన వెల్లడించారు.సిక్కు సమాజం చాలా అద్భుతమైనది, వారు మా కమ్యూనిటీకి ఎంతో చేశారు.వారు ప్రతి ఒక్కరికీ తమ హస్తాలను అందిస్తారని టౌన్‌సెంట్ పేర్కొన్నారు.వారు ప్రతి ఒక్కరినీ తమ సంస్కృతిలోకి ఆహ్వానిస్తారు.తద్వారా మనమందరం నేర్చుకోవచ్చు, గమనించవచ్చు.పంజాబీ దుస్తులను భారతదేశంలో ప్రత్యేకంగా కుట్టించి అక్కడి నుంచి అమెరికాకు విమానంలో తెప్పించారు.

Telugu Bhangra, Bhangra Dance, Bryan Townsend, Delaware, Joe Biden, Punjabi Danc

డెలావేర్ అసెంబ్లీ స్పీకర్ వాలెరీ లాంగ్‌హార్ట్స్, న్యూకాజిల్‌లోని సిక్కు సెంటర్ ఆఫ్ డెలావేర్‌లో వారి మొదటి భాంగ్రా ప్రదర్శనతో చరిత్ర సృష్టించినందుకు తన సహచరులను అభినందించారు.వాస్తవానికి వేదికపై ప్రదర్శనలు ఇస్తున్న శాసనసభ్యులను కలిగివున్న మొదటి రాష్ట్రం డెలావేర్ అవుతుందని సంతోషంగా వుందన్నారు.గురుద్వారా ప్రాంగణంలో రాష్ట్ర శాసనసభ్యులు భాంగ్రాను ప్రదర్శించడం ఆకట్టుకుందని డెలావేర్ సిక్కు సెంటర్ వ్యవస్థాపకుడు , ఛైర్మన్ చరణ్‌జీత్ సిన్హ్ మిన్హాస్ అన్నారు.ఉత్తర అమెరికాలో ఈ తరహా ప్రదర్శన ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube