హైదరాబాద్ పద్మాలయ స్టూడియో నుంచి సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది.పోలీస్ వాహనం, పోలీస్ బ్యాండ్ నడుమ మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కోనసాగనుంది.
తమ నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.కాగా ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.అంతిమయాత్ర కొనసాగుతున్న మార్గం అంతా జనసంద్రమైంది.
అభిమానులు కృష్ణకు కడసారి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.