Rashmika Mandanna : ఇంటికి అద్దె కట్టలేని పరిస్థితి...రష్మిక అనుభవించిన పేదరికం తెలిస్తే కన్నీళ్లలాగవు?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు తెరకు పరిచయమై అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి రష్మిక మందన్న ఒకరు.ఈమె కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకొని సినిమాలలో నటించడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నటిగా గుర్తింపు పొందారు.

 The Situation Of Not Being Able To Pay The House Rent If You Know The Poverty Ex-TeluguStop.com

పుష్ప సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఈ విధంగా చిత్ర పరిశ్రమలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక ఒకానొక సమయంలో ఎంతో పేదరికం అనుభవించిందని చివరికి ఇంటికి అద్దె కూడా చెల్లించని స్థితిలో ఉండేవారని తెలుస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన చిన్నప్పటి విషయాలను చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికాన్ని గుర్తు చేసుకున్నారు.చిన్నప్పుడు తమ కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనని చివరికి ఇంటికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉండడంతో ఇంటి ఓనర్స్ ఇల్లు ఖాళీ చేయించేవారని తెలిపారు.

Telugu Rashmika-Movie

ఇలా ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారుతూ ఉండే వాళ్లమని నిలువ నీడ లేక ఎన్నో సందర్భాలలో వీధులు పట్టుకొని తిరిగామని ఈమె అప్పటి విషయాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.ఇలా తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు అనుభవించిన తను ఏం అడిగినా అది కొనిపెట్టేవారు కాకపోతే మా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నేను తన తల్లిదండ్రులని ఏమీ అడిగేదాన్ని కాదని ఈమె తెలిపారు.ఇలా చిన్నప్పుడు ఇన్ని కష్టాలు అనుభవించిన తనకి ఇప్పుడు ఈ స్టార్ డం హోదా వచ్చాయంటే అవేమి సులువుగా రాలేదు.అందుకే నేను పనిని డబ్బుని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటానని ఈ సందర్భంగా రష్మిక తన చిన్నప్పటి కష్టాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube