దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో కిడ్నాప్‌కు గురైన భారత సంతతి బాలిక కథ సుఖాంతమైంది.ఆమె సురక్షితంగా కుటుంబం వద్దకు చేరినట్లు మంగళవారం నగర పోలీసులు వెల్లడించారు.
రిలాండ్స్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న 8 ఏళ్ల బాలిక అబిరా దేఖ్తా నవంబర్ 4వ తేదీ ఉదయం తన స్కూల్ ట్రాన్స్పోర్ట్ వాహనంలో కూర్చొని వుండగా.కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించుకుపోయారు.
ఆమె తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం భారత్ నుంచి వలస వచ్చి కేప్‌టౌన్‌లో స్థిరపడ్డారు.ఆమె తండ్రి నగరంలో మొబైల్ ఫోన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
దక్షిణాఫ్రికా పోలీస్ సర్వీసెస్ (ఎస్ఏపీఎస్).దేఖ్తా సురక్షితంగా ఆమె కుటుంబం వద్దకు చేరినట్లు ధ్రువీకరించింది.ప్రత్యేక పోలీస్ విభాగాలకు చెందిన ఎస్ఏపీఎస్ సభ్యులు.సిటీ ఆఫ్ కేప్‌టౌన్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాలికను సోమవారం సాయంత్రం టౌన్ టూ, ఖయెలిట్షాలోని ఒక గుడిసెలో గుర్తించారని పోలీస్ ప్రతినిధి సార్జెంట్ వెస్లీ ట్విగ్ మంగళవారం తెలిపారు.
ఖయెలిట్షా అనేది కేప్‌టౌన్ శివార్లలో వున్న నల్లజాతి టౌన్షిప్.
బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.కిడ్నాప్‌పై దర్యాప్తు జరుగుతోందని.ప్రస్తుతం నేరానికి పాల్పడిన వారిని పట్టుకునే ఉద్దేశ్యంతో పోలీస్ డిటెక్టివ్లు అనుమానితులను ప్రశ్నిస్తున్నారని ట్విగ్ తెలిపారు.
సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లుగా వస్తున్న కథనాలను ఎస్ఏపీఎస్ ధృవీకరించలేదు.చిన్నారి జాడ తెలియడంతో వీరి కుటుంబ సభ్యులు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు.
మరోవైపు చిన్నారిని విడుదల చేసేందుకు కిడ్నాపర్లు నగదు ఏమైనా డిమాండ్ చేశారా అన్నది తెలియరాలేదు.స్థానిక మీడియా కథనాల ప్రకారం.వెస్ట్రన్ కేప్‌లో కనీసం 200 మంది కిడ్నాప్‌లు జరగ్గా, అందులో అబీరా కేసు తాజాది.చాలా కిడ్నాప్‌లు డబ్బు కోసమే జరుగుతున్నట్లుగా పోలీసులు తెలిపారు.