మరి కొద్ది రోజుల్లోనే ఐపీఎల్( IPL ) సమీపిస్తున్న సమయాన ప్రతి టీం కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంది.ఇక అందులో భాగంగానే టైటిల్ ని గెలిచి చాంపియన్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టీం( Chennai Super Kings Team ) ఈసారి కూడా గెలుపు బావూటాను ఎగర వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.
ఇక అందులో భాగంగానే ఈ టీమ్ లో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్న డెవిన్ కాన్వే( Devon Conway ) గాయం కారణంగా ఈ సీజన్ లో ఆడడం లేదు.ఇక దానివల్ల చెన్నై టీం కి భారీగా దెబ్బ పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా డేవిన్ కాన్వే, ఋతురాజ్ గైక్వాడ్ ల ఓపెనింగ్ జోడి చెన్నై టీం మ్యాచ్ విజయంలో కీలకపాత్ర వహిస్తూ వచ్చేవారు.

వీళ్లిద్దరూ పవర్ ప్లే లో టీమ్ కి రావాల్సినన్ని పరుగులు రాబట్టి టీం విజయంలో కీలక పాత్ర వహించేవారు.కాబట్టి ఇప్పుడు కాన్వే టీమ్ లో లేకపోవడం వల్ల చెన్నై టీం కి భారీ దెబ్బపడే అవకాశం ఉందనే చెప్పాలి.కానీ చెన్నై టీమ్ ఇప్పుడు అతని ప్లేస్ ను మరో ప్లేయర్ తో రీప్లేస్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
అయితే ఆ ప్లేయర్ ఎవరు అంటే సౌతాఫ్రికా టీం లో కీలక పాత్ర వహిస్తున్న ‘వండర్ డస్సెన్ ‘( Rassie Vander Dussen ) …ఈయన రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో మిని యాక్షన్ లోకి వచ్చినప్పటికీ ఆయన్ని తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.

కానీ ఇప్పుడు తను ఆడుతున్న మ్యాచులు, చేస్తున్న పరుగులను చూసిన ఐపిఎల్ ప్రాంచైజర్స్( IPL Franchisers ) అతన్ని టీమ్ లోకి తీసుకోవడానికి ఉత్సాహన్ని చూపిస్తున్నాయి.ఇక అందులో భాగంగానే చెన్నై యజమాన్యం ముందుగానే అతనితో సంప్రదింపులు జరుపుతూ ఆయన్ని టీమ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఈయన కనక టీం లోకి వచ్చేనట్టయితే ఇక చెన్నై టీమ్ మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతి శయోక్తి లేదు.
ఎందుకంటే వండర్ డెస్సేన్ హిట్టర్ గా కీలక బాధ్యతలను చేపడతాడు కాబట్టి ఆయన రాక చెన్నై కి చాలా వరకు ప్లస్ అవుతుందనే చెప్పాలి…